రత్తాలుకి కొత్త బిరుదు.. అరేబియన్ గుర్రం

Update: 2017-02-17 06:07 GMT
మెగాస్టార్ మెగా బ్లాక్ బస్టర్ ఖైదీ నంబర్ 150 మూవీలో ఐటెం బ్యూటీ రత్తాలుగా నటించింది రాయ్ లక్ష్మి. కోలీవుడ్ లో తెగ బిజీగా ఉండే ఈ సుందరాంగికి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఖైదీలో మెగాస్టార్ తో ఆడిపాడిన తర్వాత తెలుగు ఆడియన్స్ కు ఈమె తెగ నచ్చేస్తే.. బాలీవుడ్ రాబోతోన్న జూలీ మూవీ కోసం అమ్మడు పడిన కష్టాన్ని అందరూ బాగానే గుర్తిస్తున్నారు.

ఇప్పటికే సోనాక్షి సిన్హా మూవీ అకీరాలో కనిపించింది కానీ.. నిజానికి బాలీవుడ్ లో రాయ్ లక్ష్మి తొలి మూవీ జూలీ2. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ.. దీనిపై ఈ భామకే కాదు.. ఆడియన్స్ లో కూడా చాలానే హోప్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫోటోస్ లో రెచ్చిపోయి మరీ రాయ్ లక్ష్మీ చేసిన అంగాంగ ప్రదర్శన దీనికి కారణం. బికినీ వేసుకునేందుకు తగిన బాడీ కోసం బాగా కష్టపడి బరువు తగ్గి నాజూగ్గా తయారైతే.. 'ఇప్పుడు నా ఫిజిక్ చూసి అందరూ అరేబియన్ గుర్రంలా ఉన్నావు' అనే కాంప్లిమెంట్ ఇస్తారని చెప్పింది రాయ్ లక్ష్మి.

జూలీ2 రిలీజ్ తర్వాత బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా.. దేశవ్యాప్తంగా తానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోతానని నమ్మకంగా చెప్పేస్తోంది రాయ్ లక్ష్మి. ఈ మూవీలో బోల్డ్ రోల్ చేసేందుకు బాగా ధైర్యం చేశానన్న ఈ భామ.. అందుకు తగ్గ రిజల్ట్ తప్పకుండా వస్తుందని చెబుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News