ఫోటో స్టోరి: బీచ్ లో రాయ్

Update: 2017-04-26 13:31 GMT
కోలీవుడ్ లో హీరోయిన్.. టాలీవుడ్ లో ఐటెం గాళ్.. బాలీవుడ్ లో సెన్సేషన్ కు సిద్ధమవుతున్న భామ.. ఇవన్నీ వేరు వేరు సుందరాంగుల గురించి కాదు.. అన్నీ లక్ష్మీ రాయ్ గురించే. ప్రతీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. అందాల ఆరబోతలో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకుంది.

ఇప్పటికే టాలీవుడ్ లో మెగా ఐటెం అనిపించుకుంటున్న రాయ్ లక్ష్మి.. సర్దార్ గబ్బర్ సింగ్- ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో నటించిన ఈ భామ.. ప్రస్తుతం హాలిడే టూర్ లో ఉంది. మియామీ బీచ్ లో చక్కర్లు కొడుతున్న ఈ బ్యూటీ.. అక్కడి నుంచి  హాట్ హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాదు.. అంత కంటే హాట్ కామెంట్స్ కూడా పెడుతోంది. "నేను నా మనసు చెప్పినదే ఫాలో అవుతా.. అది నన్ను ఇక్కడకు చేర్చింది" అంటూ తన మియామీ డైరీస్ లో కొత్త ఫోటోను షేర్ చేసింది రాయ్ లక్ష్మి.

కోలీవుడ్- టాలీవుడ్ లలో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాయ్ లక్ష్మి.. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ జూలీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ ద్వారా బాలీవుడ్ లో పాగా వేసేయాలన్నది అమ్మడి ఆలోచన. ఆ ఐడియా ఏ మాత్రం సక్సెస్ అవుతుందో తెలియాలంటే.. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News