క్వీన్ ఎలిజెబెత్ బాహుబలి 2 చూడనుందా?

Update: 2017-03-01 07:47 GMT
ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులే బాహుబలిః ది కంక్లూజన్ సినిమాను చూడలేదు. కాని చూస్తుంటే మనోళ్లకంటే ముందు ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ క్వీన్ అయిన ఎలిజబెత్ 2 ఈ సినిమాను ముందే చూడనుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ రాణీ గారికి మన సినిమా చూడాలని ఎందుకు అనిపించింది గురూ?

ఈ 2017 ఆగస్టు 15తో భారత దేశానికి బ్రిటీష్‌ వారి దగ్గర నుండి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతోంది. ఆ సందర్భంగా బ్రిటీష్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్ వారు మన సినిమాలకు గౌరవిస్తూ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంటుకు బ్రిటన్ మహారాణి చీఫ్‌ గెస్ట్ గా వస్తోంది. అక్కడ మనోళ్ళు బాహుబలి 2 సినిమాను ప్రదర్శించి.. భారతీయ సినిమా ఇప్పుడు ఏ రేంజుకు ఎదిగిందో ఆమెకు వివరిస్తారట. ఇదే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి కూడా వెళతారని తెలుస్తోంది.

కాకపోతే బాహుబలి 2 సినిమాను రెండు గంటలపాటు కూర్చుని చూసేంత ఓపిక మహారాణికి.. తీరిక మన నరేంద్ర మోడికి ఉందా అనేదే అసలు ప్రశ్న. ఒకవేళ వీళ్ళకు ఒక 15 నిమిషాలు పాటు ఏమన్నా హైలైట్స్ చూపిస్తారేమోలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News