కళ్యాణ్ కోసం పూరీ పాటలేసుకున్నాడు

Update: 2016-09-30 15:30 GMT
పూరీ జగన్నాథ్ ఏ రేంజ్ ట్యాలెంటెడ్ అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన పనేమీ లేదు. స్టోరీ.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్.. అంటూ పడే టైటిల్ కార్డ్ చూస్తే.. పూరీ ఏ రేంజ్ లో ట్యాలెంట్ చూపిస్తాడో అర్ధం అవుతుంది. హిట్స్ విషయంలో ఈ మధ్య వెనకబడ్డాడనే కామెంట్స్ రావడంతో.. కళ్యామ్ రామ్ తో తనలో కొత్త కోణాన్ని చూపించేందుకు వచ్చేస్తున్నాడు పూరీ.

ఇజం అంటూ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ నుంచి షాకులు ఇస్తూనే ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత ఇజం టీజర్ తో ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి ఇండస్ట్రీకి కొన్ని రోజులు పట్టేసింది. ఇక అక్టోబర్ లో ఇజం విడుదలకు ప్లాన్ చేస్తుండగా.. ఇప్పుడు ఈ మూవీలోని పాటలకి సంబంధించి ట్రాక్ లిస్ట్ బయటకొచ్చింది. సాధారణంగా అయితే.. ఆడియో రిలీజ్ కాకుండా.. కేవలం లిస్ట్ చూసి చెప్పేందుకు ఏం ఉండదు కానీ.. పూరీ ఈ మూవీకి ఆమాత్రం ప్రత్యేకత ఉంది. అదే.. ఇజంలో పూరీ జగన్నాథ్ రెండు పాటలు పాడేయడం. 'యే.. యే.. యే రా..' అంటూ సాగే పాటతో పాటు 'ఇజం' థీమ్ సాంగ్ ను కూడా పూరీ తనే పాడేశాడు. ఈ మూవీపై తానెంత పట్టుదలగా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు పూరీ.

నిజానికి పూరి ఇలా పాట పాడ్డం కొత్తేమీ కాదు. బిజినెస్ మ్యాన్ మూవీలో థీమ్ సాంగ్ ని.. టెంపర్ మూవీలో దేవుడా దేవుడా పాటను కూడా పాడాడు. వాటిలో వేరే సింగర్ తో కలిపి పాడగా.. కానీ లీడ్ మేల్ సింగర్ గా మాత్రం ఇజంలోనే పాడుతున్నాడు పూరీ జగన్నాథ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News