ఆ కవరింగ్ కోసం ఎన్నేళ్ల వెయింటింగో

Update: 2015-11-27 04:19 GMT
స్టార్ హీరోయిన్స్ అన్నాక మేగజైన్ కవర్ పేజ్ లపై ఎక్కడం కామన్ గా జరిగేదే. కానీ ఓ హీరోయిన్ మాత్రం అలా కవర్ పై ఎక్కడానికి చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానంటోంది. చిన్నా చితకా హీరోయిన్స్ చెపితే పెద్ద విషయం కాదు కానీ.. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాకం చోప్రాకి కూడా ఈ ఫీట్ సాధించడానికి ఏళ్లు పట్టిందంటే అది ఆలోచించాల్సిన విషయమే.

2000 సంవత్సరంలో మిస్ ఇండియా - మిస్ వరల్డ్ గా నిలిచిన ప్రియాంక.. ఆ తర్వాత ఆటోమేటిక్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న భామగా, టాప్ స్టేజ్ ని అనుభవించేసింది. ఇప్పుడు హాలీవుడ్ వెళ్లిపోయి, తన అనుభవాన్నంతా ఉపయోగించేసి ఓ మాంచి టీవీ షో క్వాంటికో కూడా చేసేస్తోంది. అయితే.. ఈ 33 ఏళ్ల బ్యూటీకి దేశంలోనే టాప్ పొలిటికల్ మేగజైన్ అయిన.. ఇండియా టుడే కవర్ పై మెరవాలన్నది కోరిక.

ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే ట్విట్టర్ ద్వారా చెప్పింది. మొత్తానికి ఇండియా టుడే డిసెంబర్ ఎడిషన్ కి.. కవర్ పై మెరుస్తోంది ప్రియాంక. అంతా బాగానే ఉంది కానీ.. వచ్చే నెలలో రిలీజ్ కానున్న బాజీరావు మస్తానీ ప్రమోషన్స్ లో తమ అభిమాన హీరోయిన్ కనపడ్డం లేదని.. ఫ్యాన్స్ బెంగ పెట్టేసుకుంటున్నారు. మరి వాళ్ల కోరిక కూడా తీర్చేయచ్చు గదా..

Tags:    

Similar News