పరువాలు మెరిసిపోయాయ్!!

Update: 2017-09-21 11:42 GMT
కన్నడ పోకిరి రీమేక్ లో  వెండితెరకు ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో అందరిని ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ప్రణీత. కెరీర్ లో జయపజయలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం బాషా భేదం లేకుండా సౌత్ లో అన్ని ఇండస్ట్రీలో సినిమాలను చేస్తోంది. ముఖ్యంగా కన్నడ లో అమ్మడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో కూడా అమ్మడు కథను మలుపు తిప్పే పాత్రలతో రానిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా అయినా సరే ఏ మాత్రం నో చెప్పడం లేదు.

అయితే ప్రణీత తెలుగులో చివరగా బ్రహ్మోత్సవం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించలేదు. కన్నడ -తమిళ్ సినిమాలను చేస్తూ.. బిజీ అయిపోయింది. అయితే చాలా రోజుల తర్వాత ప్రణీత ఫొటోలు తెలుగు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ బిగ్ బజార్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రచారానికి బూస్ట్ ని ఇస్తోంది. అంతే కాకుండా ప్రణీత ఇచ్చిన కొన్ని సెక్సీ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. లో దుస్తుల్లో కనిపించి వయ్యారంగా నవ్వులు కురిపిస్తోంది. ఇక అమ్మడి చూపులు కూడా సెక్సీగా ఉన్నాయని అంటున్నారు నెటీజన్స్. ఎప్పుడు కనిపంచని లుక్ లో కనిపించి ప్రణీత చాలా బావుంది అనే ప్రశంసలను అందుకుంటోంది.

ప్రస్తుతం ఈ కన్నడ భామ బిజీ బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది. మలయాళం లో రెండు సినిమాలను మరియు కన్నడ లో మరొక సినిమాను చేస్తోంది. ప్రస్తుతం వీటిలో ఒకటి రిలీజ్ కి రెడీగా ఉంది.
Tags:    

Similar News