కొంటె చూపులతో కవ్విస్తున్న బాలయ్య హీరోయిన్..!

Update: 2021-04-10 14:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుంది అనిపించిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ స్టార్డం అనేది అందరికి దొరకడం కష్టమే. ఎందుకంటే అసలే ఇది గ్లామర్ ప్రపంచం. అందులోను ఎల్లప్పుడూ కొత్త అందాలతో పోటీ పడాల్సిన విషయం. అలాగే అందరిలోను ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గ్లామర్ ప్రపంచంలో నిలబడాలంటే ఖచ్చితంగా అందాల ప్రదర్శన చేయాల్సిందే. ఆ విషయం అప్ కమింగ్ కుర్ర హీరోయిన్ లకు బాగానే తెలుసు. అందుకే ఎలాంటి మొహమాటం పడకుండా గ్లామర్ పాళ్ళు ఒలికిస్తూనే ఉంటారు. అలాంటి స్టైలిష్ హీరోయిన్లలో ఒకరు ప్రగ్యాజైస్వాల్. ఈ అమ్మడు ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'బిబి3' మూవీ పై ప్రగ్యా భారీ ఆశలే పెట్టుకుంది. దాదాపు ప్రగ్యా కూడా మూడేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య సినిమాతో అలరించనుంది. ఈ సమ్మర్ మే 28న బిబి3 రిలీజ్ కాబోతుండగా.. సెకండ్ వేవ్ కరోనా దేశంలో భయం పట్టుకుంది. మరి ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తిగాని ఈ సినిమా అసలు కరోనా సమయంలో ఎలా పూర్తిచేస్తారనే టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రగ్యాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగిన సంగతి తెలిసిందే. అందుకే సోషల్ మీడియా ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఫోటోషూట్స్ జరిపి గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అమ్మడు మినీ జీన్స్ డ్రెస్ ధరించి దర్శనమిచ్చింది. అలా జీన్స్ లో కొంటె చూపులతో కుర్రకారు మనసు దోచుకుంటోంది. ప్రస్తుతం ప్రగ్యా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News