బాహుబలి3పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్

Update: 2017-06-21 12:49 GMT
బాహుబలి ది బిగినింగ్.. బాహుబలి ది కంక్లూజన్.. ఈ రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులకు.. బాహుబలి3 కూడా ఉంటే బాగుండును అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి ఆ సినిమాలో నటించిన వాళ్లకు.. మూవీ తీసిన వాళ్లకు బాహుబలి3 పై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. షాక్ కొట్టించేయక మానదు.

బాహుబలి3 అంటే మనకు బాగానే ఉండొచ్చేమో కానీ.. ఈ చిత్రానికి దర్శకత్వం  వహించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. దగ్గుబాటి రానాలు ఒక టీవీషోలో పాల్గొనగా.. బాహుబలి పాత్రధారి ప్రభాస్ కు ఫోన్ కాల్ చేశారు. ప్రభాస్ తో బాహుబలి3 గురించి రాజమౌళి ప్రతిపాదిస్తూ.. బాహుబలి3 గురించి డిస్కస్ చేద్దాం అన్నాడు. అంతే ఒక్కదెబ్బకు షాక్ తినేసిన ప్రభాస్.. 'అమ్మ.. నీ.. య*' అంటూ నవ్వేశాడు. ఫోన్ కాల్ కావడంతో.. ఈ రియాక్షన్ పై ప్రభాస్ ఫీలింగ్ చూసేందుకు అవకాశం లేకపోయినా.. రియాక్షన్ వచ్చిన స్పీడ్.. వచ్చిన తీరు చూస్తే మాత్రం ప్రభాస్ ఎంతగా షాక్ తిన్నాడో అర్ధమవుతుంది.

ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి రాజమౌళి.. రానాలు ఉన్నపళంగా ఫెళ్లున నవ్వేశారు. మరి బాహుబలి రెండు భాగాల కోసం ఐదేళ్లు కేటాయిస్తే.. ఇప్పుడు బాహుబలి3 అనగానే దానికోసం ఎన్నేళ్లు పడుతుందో అనే ఆలోచన వచ్చి.. షాక్ లో అలా మాట్లాడేయడంలో ఆశ్చర్యమేమీ లేదు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News