బాలీవుడ్ కోసం ప్రభాస్ ప్రయత్నాలు

Update: 2017-04-19 14:44 GMT
బాహుబలి తెచ్చిన క్రేజ్ కి.. బాలీవుడ్ లో చేస్తానని ప్రభాస్ ఒక్క మాట చెబితే చాలు.. బోలెడంత మంది నిర్మాతలు రెడీగా ఉంటారు. ఇప్పటికే ప్రభాస్ ని ఒప్పించేందుకు కరణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడనే టాక్ ఉంది. అలాంటపుడు ప్రభాస్ ప్రయత్నాలేంటి అనే డౌట్స్ సహజం.

అయితే.. ప్రభాస్ ప్రయత్నాలు బాలీవుడ్ కోసమే అయినా.. అక్కడ సినిమా చేయడం కోసం మాత్రం కాదు. ఇక్కడే చేసే సినిమాను.. అక్కడ మార్కెట్ ఎలా చేసుకోవడం అన్న విషయంపైనే దృష్టి పెట్టాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ మరుసటి చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్.. బాహుబలి ది కంక్లూజన్ కంటే ఒక రోజు ముందు విడుదల కానుండగా.. సాహోను సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు.. ముంబైలోని ఓ పీఆర్ ఏజన్సీతో ఒప్పందం చేసుకున్నాడు ప్రభాస్. రీసెంట్ గా మొదలైన మూవీపై ఇంతగా దృష్టి పెట్టడానికి కారణం.. ప్రభాస్19గా ప్రారంభమైన ఈ చిత్రంలో ప్రభాస్ కు కూడా వాటా ఉంటుందట.

అలాగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతల్లో ఒకడైన ప్రమోద్.. ప్రభాస్ కు కజిన్. యాక్షన్ ఓరియెంటెడ్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 150  కోట్ల రూపాయల బడ్జెట్ తో.. బాలీవుడ్-హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారంతో నిర్మించున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News