మ్యారేజ్ లుక్స్ కి బంపర్ ఆఫర్

Update: 2016-10-27 04:49 GMT
గతకొన్నేళ్ళుగా అంచనాలు అనేవి లేకుండా విడుదలైన చిన్న సినిమా ఒక్కటైనా భారీ విజయం సాధించి ఆ యేటికి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. ప్రేమకధా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ ఈ ఏడాది పెళ్ళిచూపులు. అసలు వెండితెరమీద ప్రదర్శించడానికే నానా విమర్శలు ఎదుర్కున్న చిత్రం ఇప్పుడు శతదినోత్సవ వేడుకల దిశగా పరుగులుతీస్తుంది.

అయితే ఈ సందర్భంగా పెళ్ళిచూపులు చిత్ర దర్శకుడు తరుణ్ సోషల్ మీడియా ద్వారా ఒక కొత్త విషయాన్ని వెల్లడించాడు. తన సినిమాను చూసి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా ఫోన్ చేసి అభినందించినట్టు అంతేకాకుండా తన సినిమా రీమేక్ రైట్స్ ని సైతం కోరినట్టు తెలిపాడు. లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో దిట్ట అయినా గౌతమ్ మీనన్ ని మెప్పించాడంటే మన తరుణ్ కెరీర్ తొలినాళ్ళలోనే మంచి గుర్తింపు పొందినట్టు అర్ధమవుతుంది.

గౌతమ్ తమిళ వెర్షన్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియకపోయినా తప్పకుండా అక్కడ కూడా ఇది ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా మిగులుతుందని అందరి అంచనా. గౌతమ్ మీనన్ తెరకెక్కించి నాగచైతన్య నటించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాకి సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ ఈరోజు విడుదలకానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News