ఎన్టీఆర్ కు సాటి లేరు - పవన్ కళ్యాణ్

Update: 2016-04-04 18:29 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేస్తుండడంతో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడి మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ముంబై నుంచి హైద్రాబాద్ వచ్చి ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ లు చేస్తున్నారు మీడియా ప్రతినిధులు. అప్పట్లో అనుపమకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్.. రీసెంట్ ఇంటర్వ్యూలో మరిన్ని కొత్త సంగతులు చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తాను సూపర్ ఫ్యాన్ అని చెప్పిన పవన్.. సర్దార్ ను స్టోరీ ప్రకారమే హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తనకు స్టార్ డం మీద మమకారం - ఇష్టం లేవని వివరించాడు. అయితే.. తన యాక్టింగ్ తో ఎవరికీ అందని స్థాయిలో ఉండడంపై స్పందన అడిగితే మాత్రం.. ఈ విషయంలో ఎన్టీఆర్ సాటి ఎవరూ రాలేరని.. ఆయన లాంటి నటుడు ఉండరని అన్నాడు పవన్.

పాటల్లో నటించడానికి - డ్యాన్సులు చేయడంలోనూ ఇబ్బంది పడతానని చెప్పేశాడు పవన్ కళ్యాణ్.  అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానిని అని.. క్రేజ్ విషయంలో ఆయన్ను అందుకోవడం సాధ్యం కాదని చెప్పేశాడు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ యాక్టింగ్ కి సాటి కానీ.. చిరంజీవి క్రేజ్ కి పోటీ కానీ ఉండదని పవన్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News