తుపాకి రాక్స్‌: పవన్‌ సినిమా లాంచ్‌

Update: 2016-04-27 08:00 GMT
తుపాకి.కామ్‌ చెప్పిందే మళ్లీ జరిగింది. తన అన్నయ్య సినిమా లాంచింగ్‌ రోజునే తన సినిమా కూడా లాంచ్‌ చేస్తే.. ఖచ్చితంగా అది అనవసర అపార్ధాలకూ.. లేనిపోని మిస్‌ అండర్ స్టాండింగ్‌ ల కు దారి తీస్తుందని ఫీలయిన పవన్‌.. తన సినిమాను ఈరోజే లాంచ్‌ చేసేశారు. ఈ విషయం ముందుగా ప్రపంచానికి తెలియజేసింది తుపాకి వెబ్ సైట్‌ మాత్రమే.

ఈరోజు ఉదయం ఒక దివ్యమైన ముహూర్తాన.. శరత్‌ మరార్‌ ఆఫీస్‌ లో.. పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా లాంచ్‌ అయ్యింది. ఎస్‌.జె.సూర్య డైరక్షన్‌ లో ఒక యాక్షన్‌ లవ్‌ స్టోరీ తీయబోతున్నా అంటూ పవన్‌ ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లాంచ్‌ కు పవన్‌ వైట్‌ కలర్‌ లుంగీ అండ్‌ సిల్కు చొక్కా లుక్‌ లో అదరగొట్టేశారు. ఈసారి మీసాలు లేని పవన్‌ కళ్యాణ్‌ మాయ చేస్తున్నాడనే చెప్పాలి. సర్దార్‌ సినిమాతో లాసులు చవిచూసిన పంపిణీదారులకే ఈ సినిమాను కూడా ఇస్తారట.

మరిన్ని లేటెస్ట్‌ అప్డేట్స్‌ కోసం చదువుతూ ఉండండి తుపాకి.కామ్‌
Tags:    

Similar News