ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సరిలేరు మీకెవ్వరూ

Update: 2015-10-05 11:30 GMT
అభిమానులకు తమ హీరో మంచి సినిమా తీస్తే.. అదే పెద్ద గిఫ్టు. హిట్టు సినిమా తీస్తే కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతారు ఫ్యాన్స్. ఇక ఆడియో ఫంక్షన్ లోనో, ఇంకేదైనా వేదికలోనో తమ గురించి హీరో ప్రస్తావిస్తే చాలు అంతకంటే ఆనందం వారికి మరొకటి ఉండదు. తమ హీరో నుంచి ఇంకేమీ ఆశించరు ఫ్యాన్స్. ఇంత నిస్వార్థంగా తమ హీరోల్ని ప్రేమించే అభిమానులు.. తమ అభిమాన కథానాయకుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. తాజాగా ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన కథానాయకుడి కోసం ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేయడం విశేషం.

నందమూరి కుటుంబానికి వీరాభిమానులున్న అనంతపురం జిల్లా నుంచి ఓ అభిమానుల బృందం హైదరాబాదుకి వచ్చి ఎన్టీఆర్ ఇంట్లో అతణ్ని కలిశారు. రూ.35 లక్షల విలువైన ఖరీదైన చీరను తారక్ కు బహుకరించారు. మరీ 35 లక్షల ఖరీదేంటి అనుకుంటున్నారా? అది బంగారు తీగలతో అల్లిన చీర. సీనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి బసవతారకమ్మల ఫొటోల్ని ఆ చీరపై పెయింట్ చేయడం మరో విశేషం. తన కోసం ఇంత ఖరీదైన చీర తీసుకురావడం చూసి ఎన్టీఆర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ గిఫ్ట్ తెచ్చిన అభిమానులతో కాసేపు గడిపి.. వారితో ఫొటోలు దిగాడు.
Tags:    

Similar News