ఎన్టీఆర్ పైనా 80 పెట్టేస్తున్నారు

Update: 2016-05-24 13:15 GMT
ఈ ఏడాది అత్యధిక అంచనాలు ఉన్న సినిమాల్లో రెండు ఘోరంగా నిరుత్సాహపరిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింద్ - సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవంలు.. ఆడియన్స్ నే కాదు.. బాక్సాఫీస్ ను కూడా ఆకట్టుకోలేకపోయాయి.

సర్దార్ పై దాదాపు 80 కోట్ల ప్రీ రిలీజ్  బిజినెస్ జరిగింది. పవన్ స్టామినా - ఫామ్ ని అంచనా వేసుకుని.. గత చిత్రాలకు మించిన బిజినెస్ చేస్తుందనే అంచనాతో భారీ రేట్లకు కొనేశారు. తీరా ఈ మూవీ ఫుల్ రన్ లో 52 కోట్లను రాబట్టి ఆగిపోయింది. రీసెంట్ గా మహేష్ బ్రహ్మోత్సవం పరిస్థితి కూడా ఇంతే 85 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఫుల్ రన్ అంతా కలిపినా.. అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

పవన్ - మహేష్ ల తర్వాత విడుదల రానున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ అంటూ కొరటాల శివతో చేస్తుండగా.. ఆగస్ట్ 12న విడుదలకు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ రీసెంట్ గా ట్రాక్ లోకి రావడం, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కొరటాల తెచ్చుకున్న సూపర్ క్రేజ్ కారణంగా... జనతా గ్యారేజ్ పైనా అదే స్థాయిలో బిజినెస్ జరగొచ్చని అంటున్నారు. అంటే ఈ ఏడాది మరో 80 కోట్ల మార్కెట్ చేసే సినిమా థియేటర్లలోకి రావడం ఖాయం. సర్దార్ - బ్రహ్మోత్సవంలు ఇచ్చిన షాక్ నుంచి ఇండస్ట్రీని బయటపడేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై పడింది.
Tags:    

Similar News