అరవింద: ఈ సారి యాక్షన్ సీక్వెన్స్ లీక్

Update: 2018-09-23 07:13 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.  రిలీజ్ డేట్ ను అందుకునేందుకు త్రివిక్రమ్ టీమ్ విరామం లేకుండా.. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే 'అరవింద సమేత'కు  లీకుల బెడద మాత్రం తప్పడం లేదు.

ఇప్పటికే కొన్ని ఈ సినిమా నుండి కొన్ని స్టిల్స్ లీకయిన విషయం తెలిసిందే.  జీపులో నాగబాబుతో తో ప్రయాణం చేస్తూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ఉన్న స్టిల్..  సీమ యువకుడిగా ఉన్న ఎన్టీఆర్ గెటప్ లాంటివి గతంలో లీక్ అయ్యాయి.   తాజాగా ఈ సినిమా నుండి రెండున్నర నిముషం నిడివిగల పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లీక్ అయింది.  ఈ సినిమా స్టొరీకి కీలకమైన ఫైట్ సీన్ ఇదట.  మొత్తం 20 నిముషాల ఫుటేజ్ ను గ్రాఫిక్స్ రిఫరెన్స్ కోసం పంపితే అందులో కీలకమైన రెండున్నర నిముషాల సీన్ లీక్ అయిందని సమాచారం.  గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకుండా లీకయిన సీన్ ఇది.

లీక్ అయిన సీన్లు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.  అసలే 'అరవింద సమేత' యూనిట్ విరామం లేకుండా పనిచేస్తుంటే ఈ లీకులు వారిని టెన్షన్ పెడుతున్నాయట. దీంతో ఇకపైన లీకుల జరగకుండా మరింత జాగ్రత్తగా ఉండేందుకు హారిక హాసిని వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 
Tags:    

Similar News