మార్చ్ నుంచి #ఎన్టీఆర్28
నందమూరి యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత మూడేళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టెంపర్ నుంచి ఏ మాత్రం స్పీడ్ ను తగ్గించకుండా జాగ్రత్తగా తనకు సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటు తన మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటున్నాడు. చివరగా జై లవ కుశ తో మంచి హిట్ అందుకున్న తారక్ నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలని ట్రై చేస్తున్నాడు. తన 28వ సినిమా కోసం అభిమానులు కూడా చాలానే ఎదురుచూస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ ప్రాజెక్ట్ గత ఏడాది పవన్ అతిథ్యంలో పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ ని మరికొన్ని రోజుల్లో త్రివిక్రమ్ పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. అజ్ఞాతవాసి సినిమా ఇచ్చిన డిజాస్టర్ నుంచి కోలుకునే విధంగా ఈ సినిమాతో హిట్టు కొట్టాలని త్రివిక్రమ్ కథలో కొన్ని మార్పులు కూడా చేశాడని తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి స్టార్ట్ కానుంది.
దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు పూర్తి తారగణాన్ని టెక్నీషియన్స్ ని మాటల మాంత్రికుడు సెట్ చేసుకున్నాడు. త్వరలో స్పెషల్ ఎనౌన్సమెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ తన ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాడు. సినిమా లొకేషన్స్ కూడా అన్ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా త్రివిక్రమ్ కామెడీ ఎంటర్టైనర్ తరహాలో ఉండనుంది.