మహర్షి సౌండ్ గట్టిగా వినపడాలి

Update: 2019-04-24 05:52 GMT
భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది గ్యాప్. వంశీ పైడిపల్లి లాంటి ప్రూవ్డ్ టాలెంటెడ్ డైరెక్టర్. కోట్లు మంచి నీళ్లలా ఖర్చు పెట్టె ముగ్గురు అగ్ర నిర్మాతలు. ఇవన్నీ కాదు మహేష్ బాబు అనే మేజిక్. ఇవి చాలవా ఒక సినిమాకు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా హైప్ రావడానికి. కానీ మహర్షి విషయంలో అలాంటి వాతావరణం కనిపించకపోవడం ప్రిన్స్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది.

ఇప్పటిదాకా ఒక టీజర్ మూడు ఆడియో సింగల్స్ విడుదలయ్యాయి. ఏది కూడా అంచనాలలో సగం కూడా అందుకోలేదన్నది వాస్తవం. అభిమానులు ఓకే అనుకున్నా సామాన్య ప్రేక్షకులు దీన్నుంచి ఆశించింది చాలా ఎక్కువ. ఓ వీడియో సాంగ్ ప్రోమోని వదిలినా లాభం లేకపోయింది. ఇవాళ సాయంత్రం పదరా పదరా అనే థీమ్ బేస్డ్ సాంగ్ ఒకటి వస్తోంది.

తువాలు తలపై చుట్టుకుని పొలంలో ఎద్దులతో నాగలి దున్నుతూ ఉన్న మహేష్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది. కానీ ఇది కూడా శ్రీమంతుడు ఛాయల్లోనే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ పాట ఓ రేంజ్ లో ఉంటే తప్ప మ్యూజిక్ లవర్స్ మహర్షి ఆల్బమ్ కి పాస్ మార్కులు వేసేలా లేరు. భరత్ అనే నేనులో టైటిల్ ట్రాక్ తో పాటు వచ్చాడయ్యో సామీ సూపర్ హిట్ అయ్యాయి. మహర్షిలో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక మిగిలింది ఈ పదరా పదరా.

ఇది దాన్ని మించే స్థాయిలో ఉంటే బాగానే కవర్ చేసుకోవచ్చు. టీజర్ రెస్పాన్స్ చూశాక టీమ్ చాలా జాగ్రత్తా ట్రైలర్ ని కట్ చేస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడు దీనికి వచ్చే స్పందన మహేష్ యూనిట్ కి చాలా ఇంపార్టెంట్. మాములు వైరల్ అయితే సరిపోదు. రచ్చ చేయాలి. అప్పుడు మహర్షి విషయంలో కనిపిస్తున్న నిరాసక్తత మాయమవుతుంది. అది ఎంతవరకు నెరవేరుతుందో జస్ట్ ఇంకొద్ది గంటల్లో తేలిపోతుంది
    

Tags:    

Similar News