ఈసారి బాలయ్యకు లోటు లేదా..

Update: 2017-03-20 05:26 GMT
ఈ మధ్య కాలంలో ప్రతీసారి నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాత్రం వెంటనే హీరోయిన్ల సమస్య ఏర్పడుతోంది. అందుకే చాలా ఎక్కువగా పేమెంట్లు ఇచ్చేసి నయనతారన తీసుకురావడం జరిగింది. ఆ తరువాత రాధికా ఆప్టే.. సోనాల్ చౌహాన్ వంటి చిన్న రేంజ్ హీరోయిన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కూడా టోటల్ గా అవుటాఫ్‌ ఫామ్ అయిపోతున్న శ్రీయకు ఒక మెగా ఛాన్స్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు పూరి జగన్ డైరక్షన్లో రూపొందుతున్న సినిమాకు మాత్రం పెద్దగా ప్రాబ్లమ్ లేదంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా స్టార్ హీరోయిన్ల చేతిలో కూడా సినిమాలు లేవు. అందుకే అందరూ ఏ సినిమా వచ్చిన చేయడానికి రెడీగానే ఉన్నారు. అదిగో మొన్ననే మిల్కీ బ్యూటి తమన్నా బాలయ్య సరసన హీరోయిన్ గా చేయడానికి అవకాశం ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నా అనేసింది. ఇప్పుడు డస్కీ సైరన్ అమలా పాల్ కూడా తనకూ ఛాన్సొస్తే చేయడానికి రెడీ అనేసిందట. పైగా పూరి జగన్ మీద భామలందరికీ బాగానే గురి ఉంది కాబట్టి.. ఇట్టే సైన్ చేసేలా ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమాలో కొత్తమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకుంటారని ముందులో టాక్ రాగా.. ఇప్పుడు మాత్రం పాపులర్ స్టార్లనే తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఫైనల్ గా పూరి అండ్ బాలయ్య ఎవరికి ఓకె చెబుతారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News