కొత్త హీరోయిన్ కత్తి లాంటి రికార్డు

Update: 2016-02-15 09:21 GMT
సినిమాల్లో సత్తా చాటేందుకు ట్రై చేసే అమ్మాయిలకు హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంత తేలిక కాదు. కానీ ఫ్యామిలీలో అప్పటికే ఓ హీరోయిన్ ఉంటే.. కొంచెం సులువుగానే ఛాన్స్ వస్తుంది. కానీ.. నిక్కీ గల్రానీ ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. అసలు ఈ నిక్కీ ఎవరో కాదు.. అప్పట్లో బుజ్జిగాడులో ప్రభాస్ మరదలుగా చేసిన సంజనకి చిట్టి చెల్లెలే ఈ నిక్కీ గల్రానీ.

ఈ సుందరి ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నెల 19న రిలీజ్ కానున్న సునీల్ కృష్ణాష్టమి మూవీతో  హీరోయిన్ గా అరంగేట్రం చేయబోతోంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. లుక్స్ విషయంలోనూ అమ్మడికి మంచి పాయింట్లే పడుతున్నాయి. అలాగే సునీల్ నుంచి కూడా చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో... బాక్సాఫీస్ దగ్గర కృష్ణాష్టమి పండగ ఖాయం అంటున్నారు సినీ జనాలు.

అయితే నిక్కీ గల్రానీకి ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నా.. అదే ఫిబ్రవరి 19న మరో రికార్డు కూడా సాధించనుంది. అదే రోజు ఆది పినిశెట్టి హీరోగా నటించిన మలుపు చిత్రం కూడా విడుదలవుతోంది. ఇందులో కూడా హీరోయిన్ నిక్కీ గల్రానీయే. అంటే ఓ కొత్త హీరోయిన్.. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తోందన్న మాట. అంటే డబుల్ డెబ్యూట్ అనాల్సిందే. బహుశా.. నిక్కీ గల్రానికి తప్ప మరే హీరోయిన్ కి ఈ రికార్డ్ లేకపోవచ్చు.
Tags:    

Similar News