మహేష్ రెండు సార్లు షాకయ్యాడు

Update: 2016-10-18 17:30 GMT
సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా నటించిన నందినీ నర్సింగ్ హోమ్ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. ప్రమోషన్ వర్క్స్ బాగా స్లోగా ఉన్నాయనే మాట వినిపించడంతో.. అర్జంటుగా యూనిట్ అంతా రంగంలోకి దిగిపోయింది. సింపుల్ స్టోరీ అయినా విపరీతంగా ఆకట్టుకుంటుందన్న నవీన్.. తమ కుటుంబ సభ్యుడు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తనను చూసి షాక్ అయిన సందర్భాన్ని వివరించాడు.

'నేను గతంలో మహేష్ బాబు సినిమాలకు కూడా ఎడిటింగ్ వర్క్స్ చేశాను. హెల్త్ ప్రాబ్లెమ్స్ రావడంతో అందులోంచి తప్పుకున్నాను. అంతకు ముందు నుంచే నాకు హీరో అవాలనే కోరిక ఉంది. ఎడిటింగ్ సమయంలో మహేష్ కి ఆ మాట చెప్పినపుడు షాక్ తిన్నాడు. అప్పుడు నేను 130 కిలోల బరువు ఉండేవాడిని. నా పర్సనాలిటీకి హీరో అవడం కష్టం అని చెప్పినా.. బెస్టాఫ్ లక్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించాడు మహేష్ బాబు' అంటూ మొదటిసారి మహేష్ ని షాక్ కి గురి చేసిన సందర్భాన్ని వివరించాడు నవీన్ విజయ్ కృష్ణ.

'ఆ తర్వాత తనకు 2 సంవత్సరాలు కనిపించలేదు. ఈ సమయంలో వెయిట్ లాస్ వర్కవుట్స్ చేసి బరువు తగ్గించుకుని.. కనిపించినపుడు కూడా మహేష్ బాబు షాక్ తిన్నాడు' అంటూ నవ్వేసిన నవీన్.. నందినీ నర్సింగ్ హోమ్ తప్పకుంటా ఆడియన్స్ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News