జైలుకెళ్లిన నవదీప్

Update: 2017-10-20 17:42 GMT
తారలు అప్పుడపుడు వారి ప్రవర్తనతో అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలుస్తారు. అంతేకాకుండా వారే ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఇక. మీడియాలలో వారి గురించి స్పెషల్ న్యూస్ లు పడాల్సిందే. ఇక సోషల్. మీడియా వచ్చిన్నప్పటి నుండి తారల మంచి తనాలు చాలా వరకు ఈజీగా తెలిసిపోతున్నాయి.

ఇప్పుడు అదే తరహాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు నటుడు నవదీప్. కెరీర్ మొదట్లో మంచి విజయాలను అందుకొని గుర్తింపు పొందిన ఈ హీరో రాను రాను సైడ్ హీరో క్యారెక్టర్ జోన్ లోకి వచ్చేశాడు. పలు రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. రీసెంట్ గా బిగ్ బాస్ షోలో సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ మెప్పించాడు. అయితే రీసెంట్ గా మనోడు ఎవరు ఉహించని విధంగా చర్లపల్లి సెంట్రల్ జైల్లో కనిపించాడు.

దీపావళి పండుగ సందర్భంగా అక్కడ సిబ్బందితో పండగను జరుపుకున్నారు. ఈ వేడుకలో నటుడు ఆదర్శ్ కూడా వచ్చాడు. దానికి సంబంధించిన ఫోటోని నవదీప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. బిగ్ బాస్ తర్వాత వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. అయితే ఒక కొత్త సినిమా చిత్రీకరణ కొరకే ఆదర్శ్ - నవదీప్ జైలు అధికారులను స్పెషల్ గా కలిసినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News