ఫస్ట్ లుక్: నిన్ను కోరి అంటున్న నాని

Update: 2017-02-23 10:48 GMT
వైజాగ్ నుండి అమెరికా వరకు.. చిన్నపిల్లల నుండి పెద్దాళ్ళ వరకు.. లవర్స్ నుండి పెళ్ళయినవారి వరకు.. అందరూ కూడా లెట్స్ సెలబ్రేట్ లైఫ్‌ అంటున్నాడు హీరో నాని. ఎందుకో తెలుసా?

మొన్ననే కదండీ నేను లోకల్ సినిమా రిలీజైంది అనుకుంటే.. అప్పుడే మనోడు అమెరికాలో తన కొత్త సినిమాను షూటింగ్ కూడా చేసేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ రిలీజైంది. ''నిన్ను కోరి'' అంటూ ఈ సినిమాకు టైటిల్ ను కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో నాని పక్కనే నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి మరో హీరోగా చేస్తున్నాడు. కొత్త కుర్రాడు శివ నిర్వాణ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఇక పోస్టర్ ను చూస్తేనే కథ అంతా అమెరికాలో జరుగుతోంది అనే ఫీల్ ను ఇస్తూ.. వెనుక శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ను పెట్టడం.. అలాగే బంగారు వర్ణపు మెరుపులతో 'లెట్స్ వెల్కమ్ లైఫ్‌' అనడం బాగుంది.

మరో కొసమెరుపు ఏంటంటే.. తన స్పీడుతో దూసుకుపోతున్న నాని.. జూలై 2017లో ఈ సినిమాను దించేస్తున్నాడు. ఇక మరోసారి గోపి సుందర్ తన కమ్మనైన బాణీలను నాని కోసం అందిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News