గీత తనకు బాడీ గార్డ్ అయిందన్న నాగ్

Update: 2018-09-21 06:10 GMT
'దేవదాస్' ఆడియో ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ లో నాగార్జున స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.  నానిపై ప్రశంసల జల్లు కురిపించిన నాగార్జున దేవదాస్ హీరోయిన్లయిన రష్మిక.. ఆకాంక్ష ల గురించి కూడా మాట్లాడాడు.  ఇక టాలీవుడ్ గీత గా మారిన రష్మిక తనకు బాడీగార్డ్ అంటూ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు.  మరి 'గీత గోవిందం' లో విజయ్ దేవరకొండ రక్తం తాగిన ఈ గీత మన్మధుడికి ఎలా బాడీ గార్డ్ అయింది? అక్కినేనివారి మాటల్లోనే..

"ఈ సినిమా లో ఇద్దరు బ్యూటీఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. మొన్న మేము థాయిల్యాండ్ నుండి వచ్చేటప్పుడు రష్మిక ఫ్లైట్ లో నా పక్కన కూర్చుంది.  మూడు.. మూడున్నర గంట అలా గడిచిపోయింది.. అంతే కాకుండా నవ్విస్తూనే ఉంది.. అంతే కాకుండా నాకు బాడీ గార్డ్ గా కూడా ఉంది.  నైట్ టైమ్ కదా.. వెనకాల ఉన్నవాళ్ళు ఫుల్ గా తాగి వచ్చారు.  ఇక వాళ్ళ గోల నుండి నన్ను రష్మిక సేవ్ చేసింది... వాళ్ళను రెండు కొట్టింది కూడా.  థ్యాంక్ యు రాష్మిక.. థ్యాంక్ యు ఫర్ బీయింగ్ మై బాడీ గార్డ్.  రష్మిక.. ఐ లవ్ యువర్ ఎనర్జీ..స్మైల్ ఎవిరిథింగ్.  నీకు రెండు హిట్స్ వచ్చాయి. ఇప్పుడు 'దేవదాస్' సినిమాతో హ్యాట్రిక్ చేద్దాం. "

ఇక దేవదాస్ లో తనకు జోడీగా నటించిన ఆకాంక్ష గురించి మాట్లాడుతూ "మొన్న ట్వీట్ కూడా చేశాను ఒక అందమైన అమ్మాయి గురించి.  చాలా రోజుల తర్వాత వైజయంతీ వారు నాకోసం ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని జోడీగా తీసుకొచ్చారు.  ఆమె బ్యూటిఫుల్ అమ్మాయే కాదు.. బ్యూటిఫుల్ పర్సన్ కూడా.  నీ గురించి చాలా నైస్ థింగ్స్ చెప్పగలను.. ఆకాంక్ష.. విష్ యూ అల్ ది బెస్ట్.  నువ్వు స్టార్ అవుతావు."
Tags:    

Similar News