అంత హిట్టయినా, ఒక్క మీట్ లేదెందుకు?
సోగ్గాడే చిన్ని నాయన ఈ రేంజ్ హిట్ అవుతుందని.. కాదు కాదు బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. నాగార్జునకు నమ్మకం ఉన్నా.. ఈ స్థాయి ఆయన కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండడు. నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గట్టి పోటీలోనూ టాప్ ప్లేస్ దక్కించుకుంది. అనూహ్యంగా యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పెట్టుబడికి మూడున్నర రెట్లు వసూలు చేసి, అన్ ఎక్స్ పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది సోగ్గాడే చిన్ని నాయన.
సాధారణంగా ఫ్లాప్ సినిమాలకి, రెండో రోజే తీసేసే సినిమాలకే సక్సెస్ మీట్ అంటూ ఊదరగొట్టేస్తారు. ఇలాంటిదే రీసెంట్ గా నాగ్ కూడా చేశాడు. అఖిల్ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినా, సక్సెస్ మీట్ అంటూ మీడియాతో మీటింగ్ పెట్టాడు. మరి ఇప్పుడు ఊహించని రేంజ్ లో సోగ్గాడే చిన్ని నాయన ఇరగదీసేసింది. రిలీజ్ అయిన నాలుగు వారాల వరకు ఓ మూవీ అదరగొట్టడం సామాన్య విషయం కాదు. ఇప్పుడు ఐదో వారంలో కూడా అంతో ఇంతో సత్తా చాటుతూనే ఉన్నాడు నాగ్.
మరి ఇంత హిట్ అయి, ప్రేక్షకులను అలరించిన సినిమాకి కనీసం సక్సెస్ మీట్ పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అట్టర్ ఫ్లాప్ సినిమాలకే సక్సెస్ మీట్స్ - థ్యాంక్యూ మీట్స్ పెట్టే రోజుల్లా.. బ్లాక్ బస్టర్ మూవీకి ఒక్క మీట్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఒకళ్లిద్దరు దీనిపై నాగ్ ని కదిపినా.. నవ్వేసి ఊరుకుంటున్నాడట. ఈ నవ్వుకు అర్ధం ఏంటో? సక్సెస్ మీట్ పెట్టకపోవడానికి కారణమేంటో? నాగ్ ఒక్కడే ఆన్సర్ ఇవ్వగలడు.