నాగ శౌర్య భలే టైటిల్ పట్టేశాడే!

Update: 2019-03-12 07:54 GMT
గత ఏడాది  ఛలోతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాగ శౌర్య తర్వాత చేసిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తూ తొందరపాటు లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే అవసరాల శ్రీనివాస్ తో నాగ శౌర్య కొత్త సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా అవసరాల ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాలు ఊహలు గుసగుసలాడే-జ్యో అచ్యుతానందలో నాగ శౌర్యకు పాత్రలతో పాటు పెర్ఫార్మన్స్ పరంగా కూడా మంచి పేరు వచ్చింది.

ఇప్పుడిది హ్యాట్రిక్ మూవీ. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడా అవసరాల స్కూల్ స్టైల్ లో మంచి ఎమోషన్స్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. క్యాచీగా తెలుగుదనం ఉట్టిపడుతూ ఎవరివైనా పేర్లు వెంటనే గుర్తు రానప్పుడు వాడే పదాలనే టైటిల్ గా పెట్టి అవసరాల మరోసారి తన టేస్ట్ ని రుజువు చేసుకున్నాడు.

ఇప్పటికే దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి నాగ శౌర్య కూడా దీని మీద  కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోయే ఈ సినిమాకు ఏకధాటిగా షూటింగ్ చేయబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి
Tags:    

Similar News