సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమయ్యారు ?

Update: 2019-05-21 10:27 GMT
ఇవాళ విడుదలైన సాహో కొత్త పోస్టర్ మరీ అద్భుతంగా కాకపోయినా రిలీజ్ డేట్ పక్కాగా ఫిక్స్ చేసిన కారణంగా మరోరకంగా అభిమానులకు బాగా నచ్చేసింది. డార్లింగ్ ని ఇంకా స్టన్నింగ్ లుక్ లో చూడాలన్న వాళ్ళ కోరికను యువి సంస్థ పూర్తిగా నెరవేర్చలేదు. అసలేమీ లేకుండా ఉండటం కంటే ఇలా ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడం మంచిదేగా అంటూ ఫ్యాన్స్ సర్దుకుంటున్నారు.

ఇదిలా ఉండగా సాహో పోస్టర్ లో సంగీత దర్శకుల పేర్లు లేకపోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. శంకర్-ఎహసాన్-లాయ్ ల  ద్వయం దీనికి షూటింగ్ ప్రారంభం నాడే ఫిక్స్ అయ్యారు. పలుమార్లు యూనిట్ కూడా అదే చెబుతూ వచ్చారు. టీజర్ మాత్రం తమన్ వర్క్ చేశాడు. షేడ్స్ అఫ్ చాప్టర్ వీడియోలకు ఏదో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడారు కాని అది ఎవరిదో క్లారిటీ లేదు

ఇప్పుడు పోస్టర్ చూస్తేనేమో అసలు ఎవరి పేరూ లేదు. రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ కు సంగీత దర్శకుడు ఎవరో క్లారిటీ లేకపోవడం నిజంగా విచారకరం. ఒకవేళ పొరపాటుగా మర్చిపోయి ఉంటే దాన్ని సవరిస్తూ మరొకటి వదలడమో లేదా ప్రకటన ఇవ్వడమో చేయాలి. రెండు జరగలేదు కాబట్టి కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఏదైనా విభేధాల వాళ్ళ శంకర్ టీం తప్పుకుందా లేక ఆఖరి నిమిషంలో దీన్ని తమన్ చేతుల్లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. మజిలి తరహలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ ఇస్తాడా అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఏదో ఒకటి సాహో యూనిట్ దీనికి వీలైనంత త్వరగా స్పష్టత ఇస్తే బెటర్. లేదంటే లేనిపోని ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది


Tags:    

Similar News