ముమైత్ ఖాన్.. నలుగురితో సహజీనం చేసిందట

Update: 2017-03-25 06:42 GMT
ముమైత్ ఖాన్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరిది. ఇప్పటికింకా నా వయసు అంటూ ‘పోకిరి’ పాటకు డ్యాన్స్ చేసి తెలుగు జనాల్ని ఉర్రూతలూగించిన ఈ భామ.. ఆ తర్వాత ఇలాంటి మరెన్నో ఐటెం సాంగ్స్ చేసింది. నటిగానూ చాలా సినిమాల్లో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ చేసింది. ఐతే నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఐదారేళ్లుగా టాలీవుడ్ వైపు చూడట్లేదు ఈ ముంబయి భామ. ప్రస్తుతం ముంబయిలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నడుపుతూ జీవనం సాగిస్తున్న ముమైత్ తాజాగా ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన ఎఫైర్లు.. రిలేషన్ షిప్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేసి ఆశ్చర్యపరిచింది.

తన జీవితంలో ఇప్పటిదాకా నలుగురితో సహజీవనం చేసినట్లు ముమైత్ చెప్పింది. ఐతే ఆ సంబంధాలన్నీ ఇప్పుడు ముగిసిపోయాయని.. ఇకపై ఎవరితోనూ రిలేషన్ షిప్ పెట్టుకోనని ముమైత్ తేల్చి చెప్పింది. తన తొలి బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగినట్లు ముమైత్ తెలిపింది. తన లైఫ్ లో అదే లాంగ్ రిలేషన్ షిప్ అని ఆమె తెలిపింది. రెండో వ్యక్తితో మూడున్నరేళ్ల పాటు కలిసున్నట్లు చెప్పింది. మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు ఉన్నానని.. నాలుగో వ్యక్తితో సహజీవనం ఏడాదిన్నరలో ముగిసిపోయిందని ముమైత్ తెలిపింది. వీటిలో ఒక రిలేషన్ షిప్ కోసం తాను సర్జరీ కూడా చేయించుకున్నానని.. అందుకోసం రూ.27 లక్షలు ఖర్చయింది ముమైత్ చెప్పడం విశేషం. ఇకపై ఇలా డబ్బు వృథా చేసుకోనని ఆమె తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News