‘సిరివెన్నెల’పై మోహన్ బాబు కామెంట్స్ వైరల్..

Update: 2021-12-03 23:30 GMT
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లింది. ఆయన జరిగిపోయి రోజులు గడుస్తున్నా ఇంకా ఆయన గుర్తులను సినీ ప్రముఖులు మననం చేసుకుంటున్నారు . ప్రతీ సందర్భంలో ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా నటుడు మోహన్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎమెషనల్ స్పీచ్ ఇచ్చారు. కాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయ సందర్శనార్థం మోహన్ బాబు ఫ్యామిలీ వెళ్లలేదు.

ఎందుకంటే మోహన్ బాబు సొంత తమ్ముడు మరణించడతో ఆయన కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ‘రుద్రంకోట’ సినిమా కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు సిరివెన్నెల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.

‘సిరివెన్నెల గారి మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. మా ఇంట్లో జరిగిన సంఘటన వల్ల అక్కడికి వెళ్లలేకపోయాం. కానీ ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఎన్నో పాటలు రాసిన ఆయనను ఇండస్ట్రీ మరిచిపోతుంది. ఆయన రాసిన పాటలు ముందు ముందు కూడా వింటారు. పరిశ్రమలో వరుసగా విషాధ సంఘటనలు చోటు చేసుకోవడం విషాధంగా మారుతుంది.’ అని అన్నారు.

రుద్రం కోట సినిమాను ప్రముఖ నటి జయలలిత నిర్మించారు. ఈ సందర్భంగా జయలలిత గురించి మాట్లాడారు. ‘జయలలిత నాకు రౌడిగారి పెళ్లాం సినిమాతో పరిచయం అయింది.

మధ్యలో కొన్ని సినిమాలు చేశాం. ఆమె నిర్మాత స్థాయికి ఎదగడం గర్వకారణం.’ అని అన్నారు. ఇక ఫన్నీగా ‘ సినిమాకు ఎంత ఖర్చుపెట్టావో మనసులో ఉంచుకొని ఎక్కువే చెప్పు’ అని నవ్వుతూ అన్నారు. అలాగే సినిమా విజయం సాధించాలని అన్నారు.

‘చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడుతాయిన మా గురువుగారు చెప్పారు. ప్రతి ఒక్కరు చిన్నస్థాయి నుంచే పెద్ద స్థాయికి వస్తారు. అలాగే కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అని ఎవరూ ఫీల్ కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొదటి సినిమా కొత్తగానే ఉంటుంది. మేం కూడా కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరువాత ఇంటి వారమయ్యాం. అందువల్ల కొత్త అని ఫీల్ కాకుండా మంచి సినిమాలు తీయాలి’ అని అన్నారు.

‘ఒక సినిమాలో ప్రతి ఒక్కిరికీ ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే నిర్మాత హ్యాపీగా ఉంటే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. నిర్మాత బాగు గోసం మిగతావారు వారి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తే సరిపోతుంది. అయితే మేం సినిమాలు తీసేరోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డాం.

గుడిసెల్లో నివసిస్తూ సినిమాలు తీయాల్సి వచ్చింది. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా మంచి మంచి సినిమాలు తీశాం. కానీ ఇప్పుడున్న సౌకర్యాలతో గొప్ప సినిమాలు చేయాలి’ అని అన్నారు.
Tags:    

Similar News