డాటర్ ఆఫ్ అమీర్ ఖాన్.. చీరతో రచ్చ!

Update: 2020-05-02 10:50 GMT
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ అంటే మీడియాలో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. ఆయన కూతురు ఈరా ఖాన్ అంటే ఆసక్తి కొంచెం ఎక్కువే. మొదట్లో ఈరా సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండేది కానీ గత కొన్నేళ్ళుగా రూటు మార్చింది. మిగతా స్టార్ కిడ్స్ తరహాలో సోషల్ మీడియా ఉష్ణోగ్రతలను పెంచే కార్యక్రమం చేపట్టింది.

తాజాగా ఈరా తన కజిన్ అయిన జయన్ ఖాన్ నటిగా 'Mrs.సీరియల్ కిల్లర్' అనే నెట్ ఫ్లిక్స్ ఫిలింతో ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆమిర్ ఖాన్.. కిరణ్ రావ్.. జయన్ ఖాన్ తో పాటు ఉన్న ఒక ఫోటో ఒకటి. ఈ ఫోటోలతో పాటుగా తన ఫోటోలు కూడా షేర్ చేసింది. పైనున్న ఫోటో అందులో ఒకటి. ఈ ఫోటోలో ఎంతో వయ్యారంగా పసుపు రంగు చీర కట్టుకుని మరీ ఫోటోలకు భంగిమ ఇచ్చింది. ఎలా ఉంది ఈ ఫోటో అంటే వయ్యారం సింగారం అన్నీ 100% ఉన్నాయి. ఎంతైనా మిస్టర్ పర్ఫెక్ట్ డాటర్ కాబట్టి మిస్ పర్ఫెక్ట్ అనుకోవాల్సిందే.

ఈరా జోరు చూస్తుంటే త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సూచనలు ఉన్నాయని అనిపిస్తోంది కదా? నిజంగా ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు కానీ అంతలోపు ఈ గ్లామర్ తరంగాలు నెటిజన్ల ఫోన్లను.. లాప్ టాపులను తాకుతూ ఉంటాయి.
Tags:    

Similar News