ఆ మూవీ ఛాన్సు మిస్సయ్యావా మెహ్రీన్

Update: 2018-02-20 06:48 GMT
ఫిదా సినిమాతో కెరీర్ లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆ జోరు ఏ మాత్రం తగ్గకుండా.. ఫిదా ప్రేక్షకుల మనస్సుల్లో నుంచి వెళ్లకముందే ఇంకో మంచి ప్రేమకథతో ముందుకొచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ హీరోగా వరుణ్ కే కాదు.. హీరోయిన్ రాశీ ఖన్నాకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది.

రాశీఖన్నా చాలా రోజులుగా హీరోయిన్ గా చేస్తూ ఉన్నా ఆమెకు పేరు తెచ్చిన క్యారెక్టర్లు అంటూ పెద్దగా లేవు. ఈ లోటు తొలిప్రేమలోని వర్ష పాత్ర తీర్చేసింది. అసలు ఈ అదృష్టం.. అవకాశం మొదటిసారి కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేం మెహ్రీన్ ఫిర్జాదును వరించిందట. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ రోల్ కు ముందు మెహ్రీన్ సరిగ్గా సరిపోతుందని భావించాడని.. ఆమెకు కథ కూడా చెప్పాడని తెలిసింది. కానీ ఇందుకోసం మెహ్రీన్ కాస్త సన్నబడాలని అడిగినా దానిని ఆమె పెద్దగా కేర్ చేయలేదు. దీంతో వెంకీ మనసు మార్చుకుని రాశీఖన్నాను ఎంపిక చేసుకున్నాడట.

తొలిప్రేమ షూటింగ్ చాలా తక్కువ టైంలోనే పూర్తయింది. రిలీజయ్యాక మంచి టాక్ తెచ్చుకొంది. మరోవైపు మెహ్రీన్ కు ఈమధ్య టాలీవుడ్ లో కమర్షియల్ హిట్ కరువైపోయింది. సూపర్ హిట్ సినిమా అవకాశం చేతికందినా.. చేజేతులా వదిలేసుకుందని ఆమె ఫ్యాన్స్ కాస్తంత నిట్టూరుస్తున్నారు. 
Tags:    

Similar News