నాని హీరోయిన్ కి గన్నులతో పనేంటి?

Update: 2017-02-23 13:28 GMT

గన్స్ అంటే ఇష్టం చూపించే హీరోలు చాలామందే ఉంటారు. కానీ తుపాకుల విషయంలో హీరోయిన్స్ కాస్త దూరంగానే ఉంటారు. కానీ ఈ హీరోయిన్ కి మాత్రం తుపాకులంటే మహా ఇష్టం. కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీతో సినీ రంగానికి పరిచయం అయిన మెహ్రీన్ కౌర్ పీర్జాడాకి.. గన్స్ అంటే ఇష్టమే కాదు బోలెడంత అనుబంధం కూడా ఉంది.

మెహ్రీన్ ప్రీ నేషనల్ పిస్టల్ కాంపిటీషన్స్ లో పాల్గొంది కూడా. అప్పట్లో ఈమెకు షూటింగ్ లో ఛాంపియన్ అయిపోవాలని కలలు కూడా ఉండేవట. అయితే.. హైస్కూల్ ఎగ్జామ్స్ కారణంగా.. నేషనల్ లెవెల్ పోటీల్లో పాల్గొనలేక పోయింది. ఒక వేళ వాటిలో పాల్గొని ఉంటే.. తాను ఇంటర్నేషనల్.. ఒలింపిక్ లెవెల్ వరకూ వెళ్లిపోయేదాన్నని చెబుతోంది మెహ్రీన్. అయితే.. ఆ ఫీల్డ్ మిస్ అయినందుకు ఈమె పెద్దగా బాధ ఏమీ లేదట. ఎందుకంటే.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోయే అవకాశం రావడంతో.. ఎన్నో పాత్రలను చేసే ఛాన్స్ ఉందని.. మరెన్నో ప్రొఫెషన్స్ లో కనిపిస్తానని అంటోంది మెహ్రీన్.

ఆమె ఆశలకు తగ్గట్లుగానే బోలెడన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పుడీమె నటించిన మొదటి బాలీవుడ్ మూవీ ఫిలౌరీ రిలీజ్ కి రెడి కాగా.. సందీప్ కిషన్ తో ఓ బై లింగ్యువల్ పూర్తి చేసేస్తోంది. మరోవైపు సాయిధరం తేజ్ తో జవాన్.. వరుణ్ తేజ్ తో ఓ చిత్రం చేసేస్తోంది మెహ్రీన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News