మెహబూబ్‌ 'మెగా' లక్ మామూలుగా లేదుగా

Update: 2020-12-30 04:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్‌ అయిన మెహబూబ్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ అందరిలోకి నీవు డాన్సర్‌ గా టాప్‌ లో ఉంటావు. నీ డాన్స్‌ గ్రేస్‌ అద్బుతం అంటూ ఫినాలే ఎపిసోడ్‌ సందర్బంగా మెహబూబ్‌ ను చిరంజీవి ప్రశంసించిన విషయం తెల్సిందే. ఫినాలే ఎపిసోడ్‌ సందర్బంగా చిరంజీవి స్వయంగా సైన్‌ చేసిన 10 లక్షల చెక్‌ ను మెహబూబ్ కు అందజేయడం జరిగింది. ఆ సమయంలో మెహబూబ్‌ ఎంతో అదృష్టం చేసుకున్నాడు అంటూ అంతా అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు మరో మెగా ఛాన్స్ ను కూడా మెహబూబ్‌ దక్కించుకున్నాడు.

ఆచార్య సినిమాలో చిన్న రోల్‌ ను మెహబూబ్‌ తో చేయించాలంటూ కొరటాల శివకు చిరంజీవి సూచించారట. దాంతో మెహబూబ్ కోసం ఒక చిన్న పాత్రను కొరటాల శివ సృష్టించారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెహబూబ్‌ ఒకటి రెండు రోజుల్లోనే షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు. మొదటి రెండు లేదా మూడు రోజుల్లో మెహబూబ్ షూటింగ్ లో పాల్గొంటాడు. చిరంజీవి కాంబో సీన్ కూడా ఒకటి ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి మెహబూబ్‌ లక్‌ మామూలుగా లేదు అతడిది మెగా లక్‌ అంటూ సన్నిహితులు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు. మరో వైపు సోహెల్‌ కు కూడా చిరంజీవి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. నీవు చేయబోయే సినిమాలో చిన్న పాత్రను చేస్తానంటూ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.
Tags:    

Similar News