హల్ చల్ సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ మాషప్...

Update: 2016-08-27 09:30 GMT
జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతుంది. అయితే మనం చదవబోయే వార్త దానిగురించి కాదు. ఇటీవల ఆడియో రిలీజ్ లో విడుదల చేసిన ఈ ట్రైలర్ అభిమానులను మెప్పించింది. కాకపోతే ఇప్పటి సంభాషణ ట్రైలర్ హై లైట్స్ గురించి కూడా కాదు. ట్రైలర్ లో ఆడియో ని కట్ చేసి దానికి అచ్చుగుద్దినట్టుండే వీడియోని సమకూర్చిన వీడియో గురించి.

జనతా గ్యారేజ్ లో తారక్ పోషిస్తున్న పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఎలా వుంటుంది. మోహన్ లాల్ కి బదులుగా సినిమాలో కనిపించే అసెట్ క్యారక్టర్ చిరంజీవికి దక్కితే ఎలా వుంటుంది. ఊహే అద్భుతం కదా.. మరి దాన్ని టెక్నీకల్ మెలకువలతో వాస్తవంలోకి తీసుకొచ్చిన వారి గురించి ప్రస్తావించాలిగా..

ఎడిటింగ్ లో తన టాలెంట్ ని చూపిస్తూ పేస్ బుక్ లో ఒక ఔత్సాహికుడు పెట్టిన పవన్ - చిరు ల జనతా గ్యారేజ్ మాషప్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. డైలాగ్ కి యాక్షన్ సరిగ్గా ఎతికినట్టు జతకలిపిన ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి మరి.
Full View


Tags:    

Similar News