తొలిసారి బికినీ వేసిన మిస్ వరల్డ్

Update: 2018-01-17 06:44 GMT
మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ ఇండియాకు తెచ్చిన ఘనత దక్కించుకున్న బ్యూటీ మానుషి చిల్లర్. ప్రపంచ సుందరి అనగానే బోలెడన్ని సొగసులు కళ్ల ముందు మెదులుతాయి. అందాల పోటీలు అంటేనే సోయగాల ప్రదర్శన అనేందుకు పర్యాయపదం అయిపోతుంది. అయితే.. ఈ ఏడాది మాత్రం మిస్ వరల్డ్ పోటీలను చూశాక జనాలు కొంత డిజప్పాయింట్ అయ్యారు.

బికినీ రౌండ్ లేకపోవడంతో.. ముద్దుగుమ్మల షోకులు చూసే ఛాన్స్ లేకపోయింది. మానుషి కూడా ఇప్పటివరకూ బికినీలో తన సోయగాలను బైటపెట్టలేదు. అప్పుడు నిరుత్సాహపడ్డ వారికి.. ఇప్పుడు ఊరట కలగనుంది. డాబూ రత్నాని క్యాలెండర్ లో ఈ సుందరి తన అందాలను విచ్చలవిడిగా పరిచేసింది. ఆ క్యాలెండర్ లో తను మెరవబోతున్నట్లు చెప్పిన మిస్ వరల్డ్.. ఇందుకు సంబంధించిన ఓ పిక్ ను కూడా చూపించింది. ఇందులో ఓ బికినీలో మానుషి అందాలు ప్రదర్శించేసింది. తొలిసారిగా మానుషి చిల్లర్ బికినీలో దర్శనం ఇవ్వనుండడంతో.. ఆసక్తి బాగానే కనిపిస్తోంది.

ఈ ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ చూపించే బికినీ అందాలే హైలైట్ అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నాక.. ఇప్పటికే ఆమెకు గ్లామర్ వరల్డ్ నుంచి అనేక పిలుపులు అందేశాయి. యాడ్ అండార్స్ మెంట్స్ కుదుర్చుకోవడం సహజమే. ఇక బాలీవుడ్ కూడా ఈమెకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేందుకు సిద్ధమైపోయింది.
Tags:    

Similar News