మంచు మనోజ్.. ఇంతేనా.. ఇంకేం లేదా?

Update: 2018-09-04 17:30 GMT
మంచు ఫ్యామిలీ కొత్త తరంలో విష్ణు.. లక్ష్మిలతో పోలిస్తే మనోజ్ కే కొంచెం ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. ‘బిందాస్’.. ‘పోటుగాడు’.. ‘కరెంటు తీగ’ లాంటి విజయాలున్నాయి అతడి కెరీర్లో. వీటితో పాటు కొన్ని యావరేజ్ మూవీస్ కూడా పడ్డాయి మనోజ్ కు. కానీ గత రెండు మూడేళ్లలో మనోజ్ ట్రాక్ రికార్డు కూడా బాగా దెబ్బ తినేసింది. అతడి సినిమాలు దారుణాతి దారుణమైన ఫలితాలందుకున్నాయి. ముందున్న మార్కెట్ అంతా పోయింది. చివరగా పది నెలల ముందు ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పలకరించాడు మనోజ్. ఆ సినిమా మనోజ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీని తర్వాత ఇక ఏ సినిమా చేయాలో తెలియని అయోమయంలో పడిపోయినట్లున్నాడు మనోజ్.

మనోజ్ అన్న.. అక్కల కెరీర్లు కూడా బాగా లేవు కానీ.. వాళ్లేమీ సినిమాలు ఆపేయలేదు. ఏదో ఒక సినిమా చేసుకుపోతున్నారు. కానీ మనోజ్ మాత్రం సైలెంటైపోయాడు. ఆ మధ్య మనోజ్ అమెరికాకు వెళ్లి కొత్త సినిమా కోసం ట్రైన్ అవుతున్నాడని వార్తలొచ్చాయి. కానీ తర్వాత కూడా ఏ ప్రకటనా రాలేదు. ఇంతకుముందు ఈశ్వర్ దర్శకత్వంలో ఒప్పుకున్న సినిమాను కూడా ఆపేశాడు. ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడికో టూర్లు వేస్తున్నాడు. వాటికి సంబంధించిన విశేషాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా ఉంటున్నాడు. ఏదైనా కొత్త ట్రైలర్ వస్తే స్పందిస్తున్నాడు. ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే టచ్ చేసేలా మెసేజ్ పెడుతున్నాడు. సామాజిక కార్యక్రమాలపై స్పందిస్తున్నాడు. అభిమానులతో చిట్ చాట్లు చేస్తున్నాడు. ‘ఫసక్’ మెసేజ్ ల మీదా స్పందిస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు కానీ.. తన సినీ కెరీర్ గురించి మాత్రం ఏమీ చెప్పట్లేదు. మనోజ్ తీరు చూస్తుంటే ఇప్పుడిప్పుడే కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టేలా కూడా కనిపించడం లేదు. ఇంతకుముందోసారి సినిమాలు మానేసి సామాజిక సేవలో దిగిపోతానన్న మనోజ్.. ఆ దిశగా అడుగులేస్తున్నాడేమో అనిపిస్తోంది అతడి తీరు చూస్తుంటే.

Tags:    

Similar News