​సుష్మితను కలిసిన మహేశ్ బాబు

Update: 2017-06-25 08:13 GMT
వెండితెర పై మన అభిమాన తారలును చూసి ఆరాధిస్తాం. ఇంకా పిచ్చి అభిమానం ఉంటే వాళ్ళని ఎప్పుడైనా ఒకసారి కలవాలి చూడాలి అనిపిస్తుంది. మన తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ అంటే ఇష్టంలేని తెలుగు అభిమాని ఎవరూ ఉండరేమో. ఒక అభిమానికి తన స్టార్ హీరోని కలవాలిని ఎలా ఉంటుందో ఆ స్టార్ కు కూడా అభిమానికి ఏమైనా అయితే కలవాలనే అనిపిస్తుంది. అమితంగా ప్రేమించే ఒక అభిమాని ఆరోగ్యం చెడి ఇబ్బందిలో ఉన్నప్పుడూ ఆ అభిమాని తీరని కోరిక ఆ స్టార్ ని కలవడమే అని తెలిసినప్పుడు ఏ స్టార్ అయన పరుగున వెళ్ళి పలకరిస్తాడు. మహేశ్ కూడా ఒక చిన్నారి అభిమానిని ఇలానే కలిశాడు.

సుష్మిత అనే ఒక 14 ఏళ్ల అమ్మాయి డౌన్స్ సిండ్రోమ్ అనే జెనిటిక్ డిజార్డర్ తో భాదపడుతోంది. ఆ చిన్నారి చివరి కోరిక తన అభిమాన నటుడు మహేశ్ బాబుని కలవడం. ఈ అమ్మాయి అమ్మనాన్న  హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా సహాయం తీసుకొని మహేశ్ బాబుని కలిపించే అవకాశం ఏర్పాటుచేశారు. తను ఆరాధించే నటుడు తన కళ్ల ముందు ఉండేపాటికి ఆ చిన్నారి తన బాధ అంతా మరిచి హాయిగా నవ్వింది. ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన మహేశ్ కు అ అమ్మాయి అమ్మ నాన్న ధన్యవాదాలు తెలుపుకున్నారు. మహేశ్ రూపమే కాదు మనసు కూడా చాలా  అందమైంది అని అభిమానులు చాలా  సంతోషిస్తున్నారు.

మహేశ్ బాబు కి పిల్లలు అంటే చాలా  ఇష్టం అని అందరికీ తెలిసిందే, అతను ‘హీల్ ఏ చైల్డ్’ సంస్థకు రెయిన్బో హాస్పిటల్ కు ప్రచారకర్తగా కూడా ఉంటున్నాడు. అలాగే కొన్ని ఎన్‌ జి‌ఓ చైల్డ్ ఫౌండేషన్ సంస్థలుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నాడు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News