మహేష్ ఫ్యామిలీ.. వాటే స్టీల్ ..

Update: 2017-10-17 13:52 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఇక టాలీవుడ్ మహేష్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ మహేష్ కి ఎంత స్టార్ హోదా ఉన్నా చాలా సింపుల్ గా ఉంటారు. అదే ఆయన అభిమానులకు మరింత దగ్గర చేసింది. ఎటువంటి వివాదాలకు తావివ్వకూండా వ్యక్తి గత జీవితాన్ని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటారు.

మహేష్ ని చూస్తేనే అర్ధమవుతుంటుంది. అయనఅంత మంచివారో. అయితే ఈ సూపర్ స్టార్ తన ఫ్యామిలీ తో కూడా ఎంతో లవ్లీగా ఉంటారు. తన ప్రతి సినిమా వేడుకలకి ఫ్యామిలీని తీసుకువస్తూ ఉంటాడు. అయితే సోషల్ మీడియాలో కూడా మహేష్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఫొటోలు ఒక్కటి రిలీజ్ అయినా అభిమానులు షేర్ చేస్తూ చాలా పాజిటవ్ గా కామెంట్స్ చేస్తూ.. ఉంటారు. అయితే ప్రస్తుతం మరొక ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తండ్రిలాగే తనయుడు కూడా సేమ్ అదే డ్రెస్ లో నిలబడడం. అలాగే ఫ్యామిలీ మొత్తం ఒకే తరహాలో దర్శనం ఇవ్వడం చూస్తుంటే ఎవ్వరికైనా వావ్ అనిపిస్తుంటోంది.

అయితే తన ఫ్యామిలీ ఫొటోని నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోని అందరు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సితారా - గౌతమ్ సేమ్ మహేష్ లానే స్టీల్ ఇవ్వడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
Tags:    

Similar News