బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అయిందోచ్

Update: 2019-04-18 05:50 GMT
తమిళ నటుడు మహత్ రాఘవేంద్రకు డుండుంపీపీ టైమ్ వచ్చింది.  పలు తమిళ సినిమాలతో పాటు 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' లాంటి తెలుగు సినిమాలలో కూడా నటించిన మహత్ నిశ్చితార్థం ప్రాచి మిశ్రాతో రీసెంట్ గా జరిగింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ ఒక బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేశాడు.

ప్రాచి మిశ్రా ఒక పాపులర్ మోడల్.  గతంలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ కిరీటం కూడా గెలుచుకుంది.  మహత్.. ప్రాచి రెండేళ్ళ క్రితం ఒక ఫోటో షూట్ సమయంలో కలవడం జరిగిందట. తర్వాతా ఒకరిని ఒకరు ఇష్టపడడంతో ప్రేమలో పడిపోయారు.  ఇక జీవితాంతం కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరు కుటుంబాలను పెళ్ళికి ఒప్పించారట.  ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సెలబ్రిటీ ఫ్రెండ్స్.. అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

మహత్ నటుడిగానే కాకుండా తమిళ బిగ్ బాస్ 2 లో పాల్గొనడం ద్వారా భారీ గుర్తింపు సాధించాడు. అంతే కాకుండా జనవరి లోనే సోలో హీరోగా నటించే సినిమా "కెట్టవన్ పెరేడుత్త నల్లవన్ డా'  షూటింగ్ ప్రారంభం అయింది. 
Tags:    

Similar News