నా హీరో అందం ఇంకా పెరిగింది

Update: 2016-02-06 07:30 GMT
టైటానిక్ సినిమాని ఎవరైనా మర్చిపోగలరా? 19 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఓ చరిత్రను సృష్టించింది. ఈ మూవీలో టైటానిక్ మునిగిపోవడం ఎంత ఆకట్టుకుంటుందో.. హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ అంతకంటే ఎక్కువగా ఆకర్షిస్తుంది. లియోనార్డో డికాప్రియో - కేట్ విన్ స్లెట్ జంటను కూడా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరన్నది వాస్తవం. మరి ఇన్నేళ్ల తర్వాత ఆ జంట మళ్లీ ఒక స్టేజ్ పైకి కబుర్లు చెబితే ఇదిగో ఇలా ఉంటుంది.

ఒకసారి స్నేహం చేస్తే ఎవరినీ వదలిపెట్టడట ఈ హీరో. అప్పటికీ ఇప్పటికీ లియోనార్డో అందం కూడా ఇంకా పెరిగిందట. ఈ మాటలన్నీ చెప్పినది ఎవరో కాదు.. టైటానిక్ హీరోయిన్ కేట్. 'డికాప్రియో మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్, అందరితోనూ స్నేహం చేస్తాడు. ఎవరినీ వదిలిపెట్టడు. టైటానిక్ నాటి ఫ్రెండ్స్ ఇప్పటికీ అతనితో స్నేహం చేస్తూనే ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ డికాప్రియో అందం ఇంకా పెరిగింది.' అన్న కేట్ విన్ స్లెట్.. అక్కడితో ఆగలేదు.

'డికాప్రియోలో ధైర్యం పాళ్లు కూడా ఎక్కువే. అప్పుడే చాలా దూకుడుగా ఉండేవాడు. ఇప్పుడది ఇంకా ఎక్కువైంది. ఇబ్బందులు చుట్టుముడితే కుంగిపోకుండా.. నిర్భయంగా ఎదిరించడం డికాప్రియో తత్వం. అది కూడా బాగా పెరిగింది. రెండు దశాబ్దాల క్రితంతోపోల్చితే ఇప్పుడు నేను చూసిన మార్పు ఇదే' అంటూ తన పాత హీరోని తెగ పొగిడేసింది కేట్.
Tags:    

Similar News