నిండు గర్భిణి కాజల్ అగర్వాల్ ఈ ఫీట్స్ చూశారా? మామూలుగా అయితే వ్యాయామాలు ఓకే కానీ.. ఈ సన్నివేశంలో ఏంటిదీ కాజల్? అని ప్రశ్నించేందుకు ఒక భామ్మ గారు ఉండి ఉంటే.. ఏమనేవారో కానీ..!! కాజల్ అగర్వాల్ నిండు గర్భిణి అయ్యి ఉండీ ప్రధాన ఫిట్ నెస్ లక్ష్యాలను నిర్దేశించిన తీరు షాకిస్తోంది. నిజానికి ఇది సర్ ప్రైజింగ్ గా ఉంది వీడియో చూస్తుంటే. కఠినత్వం లేకుండా సున్నితంగా వ్యాయామాలు ఎలా చేయాలో వీడియో చూపించింది సుమీ!
2020 అక్టోబర్ ముంబైలో సన్నిహితులు - కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో ఆనందకర జీవనాన్ని సాగిస్తున్న సంగతి తెలిసిందే. సంసారంలో సరిగమల్ని కాజల్ ఆస్వాధిస్తోంది. ఈ సంవత్సరం తాను గర్భిణి అన్న విషయాన్ని కాజల్ అగర్వాల్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
కాజల్ తన ఫోటో-షేరింగ్ యాప్ లో తరచుగా యాక్టివ్ గా ఉంటుంది. చందమామ తన అందమైన ఫోటోలు వీడియోలతో అభిమానులకు దృశ్యమానంగా ప్రతి అప్ డేట్ ని వెల్లడిస్తూనే ఉంటుంది. తాజాగా అక్కడ ఆమె తన బేబీ-బంప్ ను ప్రదర్శించడాన్ని చూడవచ్చు. బేబీ షవర్ ఫోటోలు మిస్ కాకుడనంత అందంగా ఉన్నాయి.
తన తాజా పోస్ట్ లో కాజల్ ప్రధాన ఫిట్ నెస్ లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వ్యాయామశాలలో శిక్షణ పొందుతోంది. ఇలాంటి కీలకమైన దశలో తనకు తానుగా ఫిట్టర్ వెర్షన్ గా మారడానికి సహాయపడిన వ్యాయామాలను కాజల్ వెల్లడించింది. కాజల్ వీడియోను షేర్ చేస్తూ, “నేను ఎప్పుడూ చాలా చురుకైన వ్యక్తిని.. నా జీవితం అంతా పనిచేశాను... చేస్తూనే ఉన్నాను.
గర్భం అనేది భిన్నమైన బాల్ గేమ్! సమస్యలు లేకుండా గర్భవతిగా ఉన్న మహిళలందరూ తమ గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఏరోబిక్ - స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలలో పాల్గొనమని ప్రోత్సహించాలి - పైలేట్స్ .. బారె నా గర్భధారణకు ముందు ..నా శరీరాన్ని మెరుగ్గా మార్చడంలో సహాయపడింది.
ఈ రూపాంతర విధానం నాకు బలంగా సున్నితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గర్భధారణలో ఏరోబిక్ కండిషనింగ్ లక్ష్యం గరిష్ట ఫిట్ నెస్ ను చేరుకోవడానికి ప్రయత్నించకుండానే మంచి ఫిట్ నెస్ స్థాయిని కొనసాగించడం అని భావించాలి.. అని తెలిపింది.
Full View