కొత్త ఐటెం గాళ్‌ ని పట్టుకొచ్చిన పవన్‌

Update: 2015-09-02 05:36 GMT
పవర్ స్టార్ పుట్టిన రోజున సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించిన బోలెడు న్యూస్ వస్తున్నాయి. పవన్ చిందులేస్తున్నానంటూ..  లక్ష్మీ రాయ్ స్వయంగా చెపుతోంది. పవన్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుండడంతో చాలా సంతోషంగా ఉందని... మొదటిసారి పవన్ తో కలిసి డ్యాన్స్ కూడా చేయబోతున్నానంటూ చెప్పింది లక్ష్మీ రాయ్. అంతే కాదు.. తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తానని కూడా అంటోందీ భామ.

గతంలో కొన్ని చిన్న సినిమాల్లో చేసినా ఈ అమ్మడికి ఇప్పటివరకూ బ్రేక్ రాలేదు. చేసినవన్నీ లోబడ్జెట్ మూవీలే కావడం, వాటిలో ఏవీ చెప్పుకోదగ్గ సక్సెస్ కాకపోవడంతో... క్లిక్ కాలేకపోయింది లక్ష్మీరాయ్. కానీ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పక్కన ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఈ మధ్య పవన్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ అంటే... అదో క్రేజ్ ఏర్పడిపోయింది. ఇలాంటి స్పెషల్ సాంగ్స్ పై పవర్ స్టార్ కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అందులోనూ ఐటెం సాంగ్స్ కి డీఎస్పీ ఇచ్చే మ్యూజిక్ అదిరిపోతుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో బ్రేక్ లభిస్తుందని ఆశలు పెట్టుకుంది లక్ష్మీరాయ్. తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఐటెం భామ దొరికినట్లే అనిపిస్తోంది. ఈ లక్ష్మీరాయ్... డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కి గర్ల్ ఫ్రెండ్ కూడా.
Tags:    

Similar News