లక్ష్మీరాయ్ బాగానే ఆరబోసిందిగా...

Update: 2016-02-13 10:11 GMT
పదహారేళ్ల వయసులో తెరంగేట్రం చేసి.. పిట్ట కొంచెం కూత ఘనం అనిపించింది లక్ష్మీ రాయ్. ‘కాంఛనమాల కేబుల్ టీవీ’ చేసే సమయానికి ఆమెకు పదహారేళ్లే. అయినప్పటికీ ఆ సినిమాలో ఓ రేంజిలో అందాలు ఆరబోసింది. కానీ ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోయింది. ఆ సినిమా ఆడలేదు. దాని తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఒళ్లు దాచుకోకుండా కష్టపడుతున్నా సరైన రిజల్ట్ రావట్లేదని తెగ ఫీలవుతోంది లక్ష్మీరాయ్. ఐతే ఎట్టకేలకు ఆమె కష్టానికి ఫలితం దక్కే రోజులు వచ్చినట్లున్నాయి. బాలీవుడ్ ఎరోటిక్ మూవీ ‘జూలీ-2’లో లక్ష్మీనే లీడ్ రోల్ చేస్తోంది.

ఇంతకుముందు ‘జూలీ’ సినిమాతో నేహా ధూపియా ఎంత ఫ్యామస్ అయ్యిందో తెలిసిందే. ఈ టైపు సినిమాల్లో హీరోయిన్లు ఎంతగా రెచ్చిపోతే అంతగా పేరొస్తుంది. లక్ష్మీ కూడా జూలీ-2లో బాగానే అందాలు ఆరబోసినట్లుంది. బీచ్ లో ఓ అర్ధనగ్నంగా పడుకుని ఉంటే.. ఆమె నడుం భాగం నుంచి కిందికి చూపిస్తూ మధ్యలో ఓ మ్యాగజైన్ అడ్డం పెట్టారు. ఆ మ్యాగజైన్ కవర్ పేజీలో లక్ష్మీ రాయ్ బొమ్మ కనిపిస్తోంది. బీచ్ లో అర్ధనగ్నంగా పడుకున్న అమ్మాయి లక్ష్మీరాయే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పోజు చూస్తుంటే సినిమాలో ఆమె ఓ రేంజిలో ఎక్స్ పోజింగ్ చేసి ఉంటుందని అర్థమైపోతోంది. దీపక్ శివసదాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News