జపాన్ లో మెగాస్టార్ ఫొటో.. కేటీఆర్ ఫిదా

Update: 2018-01-18 13:56 GMT
తెలంగాణ పాలిటిక్స్ లో ఎవరికైనా సమాధానం చెప్పగలిగే నేత ఎవరైనా ఉన్నారా అంటే మొదట ఎవరికైనా గుర్తొచ్చే పెరు కేటీఆర్. ఒక ఐటి మంత్రి ఎలా ఉండాలో కేటీఆర్ ను చూపిస్తే సరిపోతుంది అని చాలా మంది నేతలు ఆయనకు ప్రశంసలను అందించారు. రాజకీయపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ చాలా మంచి పనులు చేస్తు అందరికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ ని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఎవరు ఎలాంటి సమస్యలపై అయినా ఒక ట్వీట్ చేస్తే చాలు వెంటనే రిప్లై ఇస్తున్నారు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలని అలాగే ఆనందలను షేర్ చేసుకుంటూ యువతకి బాగా దగ్గరవుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలలో ఉన్న చాలా మంది ప్రముఖులు కూడా కేటిఆర్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఓ విధంగా ఆయనకు ఫ్యాన్స్ అవుతున్నారు. అయితే రీసెంట్ గా కేటీఆర్ ఒక స్పెషల్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా ఆనందపడ్డారు. ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కాదు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.

ప్రస్తుతం జపాన్ టూర్ లో ఉన్న కేటీఆర్ అక్కడ సుజుకి మ్యూజియంని సందర్శించారు. అయితే కేటీఆర్ అక్కడ ఒక ఫోటోని చూసి ఒక క్రేజీ ఫ్యాన్ లా చాలా ఎక్జాయిట్  అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఒక తెలుగు వ్యక్తి ఆనవాలు అక్కడ కనిపించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Tags:    

Similar News