అలాంటి రోల్ అయితేనే నిహారిక్ సేఫ్‌

Update: 2017-02-21 04:03 GMT
అసలు తమిళ హీరో విజయ్ సేతుపతి సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా రోల్సే ఉండవ్. ఉన్నా కూడా వాటిని ఎవ్వరూ గుర్తించరు. సూదుకవ్వుమ్ లో సంచితా షెట్టీ నుండి ధర్మదురైలో తమన్నా వరకు.. హీరోయిన్ పాత్రను సినిమా అయ్యాక గుర్తుపెట్టుకునే జనాలే తక్కువ. అలాంటప్పుడు విజయ్ సేతుపతికి జోడీగా మెగా డాటర్ నిహారిక ఒక సినిమా చేయడం.. అసలు ఎలా ఉంటుందంటారు?

గత సాయంత్రం తమిళంలో నిహారిక డెబ్యూను కన్ఫామ్ చేస్తూ.. విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ ఈ అమ్మడు చేస్తున్న సినిమా తాలూకు ముహూర్తం ఈవెంట్ ఫోటోస్ చెప్పకనే చెప్పాయి. అవన్నీ చూస్తే ఒక్క విషయం ఎవరికైనా అనిపిస్తుంది. అసలు తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల కోసం చాన్నాళ్ళు ఎదరు చూసిన నిహారిక.. ఇప్పుడు విజయ్ సేతుపతితో సినిమాను ఎలా ఓకే చేసిందా అనే సందేహం వస్తుంది. కొద్దో గొప్పో మనోడు చేసిన సినిమాల్లో ఒక్క నానుమ్ రౌడీ దాన్ సినిమాలో మాత్రమే.. హీరోయిన్ నయనతార అన్ని అవార్డులూ కొట్టేసింది. కాకపోతే ఆ సినిమాను తీసింది నయన్ ప్రియుడు విఘ్నేష్‌ కాబట్టి.. మనోడు నయన రోల్ ను కావల్సినంత సాగదీసి.. సినిమా మొత్తాన్నీ ఆమె చుట్టూతా తిప్పేశాడు. లేదంటే సేతుపతి సినిమాల్లో హీరోయిన్ కు పెద్దగా మ్యాటర్ ఏమీ ఉండదు.

ఒకవేళ నిహారిక ఒప్పుకున్న కథ కూడా.. అలా నయనతార రోల్ ను టైపులో ఏదన్నా కలిగియుంటే ఓకె.. లేకపోతే మాత్రం విజయ్ సేతుపతి పక్కనే సినిమా చేసి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం అనేది ప్రస్తుతానికి గగనమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News