క‌ళావ‌తి పెదాల‌కు స‌ర్జ‌రీ జ‌రిగిందా?

Update: 2022-05-16 06:14 GMT
సెలబ్రిటీలు మ‌రింత అందంగా..ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డానికి  కాస్మోటిక్ సర్జరీలకు వెళ్ల‌డం స‌హ‌జ‌మే.  పెదవులు.. ముక్కు  దవడ శస్త్రచికిత్సలు చేయిస్తుంటారు. కొంత‌మంది ఈ విష‌యాలు బహిరంగంగానే చెబుతుంటారు.  మ‌రికొంత సెలబ్రిటీలు  ఒప్పుకోరు.  అభిమానులు మాత్రమే  మునుపటి చిత్రాల నుండి వారి ముఖ కవళికలలోని తేడాలను గుర్తించి మార్పులను గ్ర‌హిస్తుంటారు.

దివంగ‌త న‌టి  అతిలోక సుంద‌రి శ్రీదేవి ద‌గ్గ‌ర నుంచి  రకుల్ ప్రీత్  సింగ్ జ‌న‌రేష‌న్ వ‌ర‌కూ ఎంతో మంది హీరోయిన్లు ఇలాంటి స‌ర్జరీల‌కు వెళ్లారు. అప్ప‌ట్లో శ్రీదేవి ముక్కు కు సర్జ‌రీ చేయించుకున్నార‌ని..స‌ర్జ‌రీ త‌ర్వాత ఆమె ముఖంలో ఎన్నో మార్పులొచ్చాయ‌ని అభిమానులు అంటుంటారు. స‌ర్జరీకి ముందే శ్రీదేవి మ‌రింత అందంగా ఉండేద‌ని ఫీలైన ఫ్యాన్స్  ఉన్నారు.

ఇక  కాజ‌ల్ అగ‌ర్వాల్..స‌మంత‌..శ్రుతిహాసన్ లాంటి వారు సైతం కాస్మోటిక్ స‌ర్జరీలు చేయించుకున్నారు. ఇదంతా గ్లామ‌ర్ ఫీల్డ్ లో స‌హ‌జ‌మే. రంగుల ప్ర‌పంచంలో పోటీని ఎదుర్కొవాలంటే బ్యూటీ విష‌యంలో ఎంతో కేర్ అవ‌సరం. జిమ్..యోగా సెష‌న్స్ తో పాటు అప్పుడ‌ప్పుడు ఇలాంటి స‌ర్జ‌రీల‌తోనూ బ్యూటీలో మార్పులు తీసుకొస్తుంటారు.

తాజాగా మ‌ల‌యాళం బ్యూటీ కీర్తి సురేష్ కూడా పెద‌వుల‌కు స‌ర్జ‌రీ చేయింద‌నే ప్ర‌చారం సాగుతుంది. కీర్తి పాత ఫోటోలు..కొత్త ఫోటోల‌కి మ్యాచ్  చేసి ఆమె పెద‌వుల్లో మార్పుల్ని గ‌మ‌నిస్తున్నారు అభిమానులు. ఇటీవ‌లే కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించిన స‌ర్కారు వారి పాట రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో కొన్ని స‌న్నివేశాల్లో కీర్తి ఫేస్ లో పెదాల కార‌ణంగా ఛెంజేస్ క‌నిపిస్తున్నాయ‌ని గ‌మ‌నించారు.

'మ మ మ‌హేషా' సాంగ్ లో కీర్తి పెదాల్ని క్షుణ్ణంగా ప‌రిశీలిచిన ఫ్యాన్స్  అమ్మ‌డు లిప్ జాక్ కి వెళ్లింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. కీర్తి సురేష్ పాత ఫోటోలు..స‌ర్కారు వారి పాట‌లో సినిమా ఫోటోల్ని ప‌క్క‌న ప్క‌నే పోస్ట్ చేసి  ఇది గ‌మ‌నించారా? అంటూ  కామెంట్లు పెడుతున్నారు. మ‌రి కీర్తి లిప్ జాబ్ కి వెళ్లిందా?   లేదా? అన్న‌ది ఆమె అధికారికంగా రివీల్ చేస్తే గాని  క్లారిటీ రాదు.

ప్ర‌స్తుతం కీర్తి సురేష్  'సర్కారు వారి పాట' సినిమా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. విజ‌యం కోసం ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తుంది. 'మ‌హాన‌టి' త‌ర్వాత స‌రైన స‌క్సెస్ ప‌డలేదు. కొన్ని లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో న‌టించినా స‌రైన‌ ఫలితాలు రాలేదు. ఈ క్ర‌మంలో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్  రాలేదు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో 'స‌ర్కారు వారి పాట‌'లో అవ‌కాశం అందుకుంది.
Tags:    

Similar News