హీరోల్లో అత‌డితో హీరోయిన్ల‌లో ఆమెతో టెన్ష‌న్ టెన్ష‌న్!

Update: 2020-12-30 05:34 GMT
హీరోల్లో ప్ర‌భాస్ వ‌ల్ల‌... హీరోయిన్ల‌లో కీర్తి వ‌ల్ల ఇంట్లో టెన్ష‌న్ టెన్ష‌న్ అని తెలిసింది. వ‌య‌సైపోతోంది పెళ్లికి రెడీ కండి అని పిలిస్తే మాట దాట‌వేస్తూ ప‌బ్బంగ‌డిపేస్తుంటే కుటుంబ స‌భ్యుల్లో ఒక‌టే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొందిట‌.

డార్లింగ్ ప్ర‌భాస్ `బాహుబ‌లి` త‌ర్వాత పెళ్లాడేస్తాన‌ని పెద‌నాన్న కృష్ణంరాజుకు మాటిచ్చి ఆ త‌ర్వాత‌ మాట త‌ప్పాడు. ఇప్ప‌టికీ పిల్ల‌ను వెతికినా స‌సేమిరా అంటూ టెన్ష‌న్ పెట్టేస్తున్నాడ‌ట డార్లింగ్. ఇటీవ‌ల‌ టాలీవుడ్ లో కొలీగ్ హీరోలు పెళ్లాడేస్తుంటే ప్ర‌భాస్ వైఖ‌రితో ఇంట్లో వాళ్లు టెన్ష‌న్ లోనే ఉన్నార‌ట‌.

ఇక క్రేజీ క్లాసిక్ హీరోయిన్ మేన‌క సురేష్ వార‌సురాలు కీర్తి సురేష్ కూడా అంతే టెన్ష‌న్ పెట్టేస్తోంది. త‌న‌కు 28 వ‌య‌సొచ్చింద‌ని ఇంట్లో వాళ్లు ఓ అయ్య చేతిలో పెట్టాల‌ని చూస్తున్నారు. కానీ కీర్తి మాత్రం కెరీర్ బిజీ అంటూ త‌ప్పించుకుంటోందిట‌. కెరీర్ బావున్న‌ప్పుడు పెళ్లేంటి ? అనేస్తోంద‌ట‌. మొత్తానికి ఆ ఇద్ద‌రి ఇండ్ల‌లో ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్ అని తెలుస్తోంది. ఇంట్లో టెన్ష‌న్ పెట్టి వీళ్లు మాత్రం తాపీగా కెరీర్ కెరీర్ అంటూ పెళ్లి బాజాల‌ను దూరం పెట్టేస్తున్నారు. ప్ర‌భాస్ .. కీర్తి సురేష్ సౌత్ లో క్రేజీ స్టార్లుగా కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న మాట నిజం. అయినా దీపం ఉన్న‌ప్పుడే సంపాదించుకోవాల‌ని పెళ్లికి దూర‌మైతే ఎలా? అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News