కత్రినాకి రంగురాళ్లపై నమ్మకం.. కారణం?

Update: 2016-09-28 08:02 GMT
చాలా మందికి రంగురాళ్లు - జాతకాలు - వాస్తులపై నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.. అదే క్రమంలో ఇవన్నీ మూఢనమ్మకాలని - ఇది ఒక బలహీనత అని చెబుతుంటారు ఇంకొంతమంది. ఇది బలమా లేక బహీనతా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే.. ఈ నమ్మకాలు కత్రినా కైఫ్ కి కూడా పుష్కలంగా ఉన్నాయట. అవి ఏస్థాయిలో ఉన్నాయంటే.. తన ఇంటిని మొత్తం హీలింగ్ క్రిస్టల్స్ తో డెకరేట్ చేసుకునేటంత!

అవును... కత్రినా కైఫ్ ప్రస్తుతం ముంబైలోని తన ఫ్లాట్ ను హీలింగ్ క్రిస్టల్స్ తో డెకరేట్ చేయించుకుంటోంది. దీనికి కారణం... తన చుట్టూ ఆవరించి ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి.. పాజిటివ్ ఎనర్జీని సమకూర్చి పెట్టడానికి ఇవి ఉపయోగపడతాయనట. ఈ మేరకు ఫ్లాట్ మొత్తాన్ని ఆ క్రిస్టల్స్ తో అలంకరింపజేస్తోందని సమాచారం. ఇదే క్రమంలో ఇప్పటికే ఈ ఫ్లాట్ ను పూర్తిగా వాస్తు ప్రకారం చేయించుకుందట ఈ హాఫ్ బ్రిటిషర్. అలా తన హోం మొత్తాన్ని వాస్తు ప్రకారం చేయించుకొవడానికి తనకు వాస్తు శాస్త్రంపై ఉన్న బోలెడంత నమ్మకమే కారణం అని చెబుతుందట.

అయితే సాదారణంగా జీవితంలో అసంతృప్తులు ఎక్కువగా ఉండటం, ఎదురు దెబ్బలు గట్టిగా తగలడం వల్ల ఇలాంటి వాటిపై నమ్మకాలు, విశ్వాసాలు పెరుగుతాయని అంటుంటారు. కాసేపు ఇదే నిజమని అనుకుంటే... కత్రినాకు ఉన్న అసంతృప్తి, తగిలిన ఎదురుదెబ్బలు ఏమిటై ఉంటాయని కొత్త డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కాగా... రణ్ భీర్ తో వేరే పడ్డాకా అతనినుంచి బయటకు వచ్చిన కత్రినా ఈ ఫ్లాట్ కు చేరి ఈ మార్పులు అన్నీ చేయిస్తోందట. అయితే ఈ నమ్మకాలకు కత్రినా వద్ద ఉన్న అసంతృప్తి, తగిలిన ఎదురుదెబ్బ ఇదేనా? ఏమో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News