టీజర్ టాక్: పవన్ పవర్ = కాటమరాయుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. పవన్ కొత్త సినిమా కాటమరాయుడు టీజర్ కోసం.. మూడు వారాలుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. రీజన్స్ చెప్పకుండా పోస్ట్ పోన్ చేశామంటూ చెప్పడం తప్ప.. ఎప్పుడు విడుదల చేస్తున్నామో చెప్పని నిర్మాతలు.. ఇప్పుడు సడెన్ గా కాటమరాయుడు టీజర్ ను ఆన్ లైన్ లో వదిలేశారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగింది కాటమరాయుడు టీజర్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తుండడంతో.. కంప్లీట్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తోనే టీజర్ ను నింపేశారు. కత్తులతో పరుగులు పెడుతున్న రౌడీలతో మొదలుపెట్టి.. పంచెకడుతున్న పవన్ ను ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ నుంచి హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పవన్ అదరగొట్టేశాడు. పవన్ స్క్రీన్ పై కనిపించేది క్షణాలపాటే అయినా.. మెస్మరైజ్ చేసి పారేశాడు పవన్ కళ్యాణ్.
'ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం' అంటూ పవన్ చెప్పే ఒకే డైలాగ్ సినిమాలో వినిపిస్తుంది. కత్తితో నరుకుతుంటే.. రెండు అర చేతులతో పవన్ ఆ కత్తిని పట్టుకునే సీన్ అదరహో. ఇక పవన్ ఇంట్లో వేసే డ్యాన్సింగ్ సీక్వెన్స్ చూపించి.. కామెడీ యాంగిల్ ని కూడా టచ్ చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన పవర్ తో కాటమరాయుడుగా కుమ్మేశాడంతే.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/