అబ్బో.. కాటమరాయుడు కోసం ఫుల్ పేజీ

Update: 2017-03-23 07:16 GMT
మామూలుగా పెద్ద సినిమాల విషయంలో ఈ మధ్యన ఏం జరుగుతోందంటే.. పేపర్లో యాడ్లు పెద్దగా ఇవ్వడం లేదు. ఎలాగో సదరు సూపర్ స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు ఇంటర్యూలు ఇస్తే ఆటోమ్యాటిక్ గా మీడియాను వాటిని ఫ్రెంటు పేజీలో వేసుకుంటుంది కాబట్టి.. వారి సినిమా ఎడిషన్ లో పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి రాసుకుంటుంది కాబట్టి.. ప్రత్యేకంగా యాడ్లు ఇచ్చేదేంట్లో అనే మైండ్ సెట్ తో ఉంటున్నారు.

ఇకపోతే కాటమరాయుడు విషయంలో మాత్రం నిర్మాత శరత్ మరార్ అసలు ఒక చిన్న సినిమాను ఎలా విస్తృతంగా ప్రమోట్ చేస్తారో.. అదే రేంజులో ప్రమోట్ చేస్తున్నారు. చివరకు రేపే రిలీజ్ అనే యాడ్ ను సాధారణంగా పవన్ కళ్యాణ్‌ సినిమాలకు కూడా పావు పేజీ యాడ్ తో సరిపెట్టేస్తున్న రోజుల్లో.. ఈరోజు అన్ని పేపర్లలో ఫుల్ పేజీ యాడ్ తో 'కాటమరాయుడు' మతిపోగొట్టేశాడు. ఏంటి పవన్ సినిమాకు కూడా ఫుల్ పేజీ యాడ్డా అంటూ అందరూ నోరెళ్ళబెడుతున్నారు మరి.

నిజానికి కాటమరాయుడు సినిమా దాదాపు 90 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అప్పుడే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీలూ సేఫ్‌  అండ్ హ్యాపీగా ఉంటాయ్. బహుశా అందుకే ఇలా ప్రచారంతో దంచేస్తున్నారని అనుకోవచ్చు మనం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News