బాహుబలి చేయనన్న ఆ సీనియర్ హీరోయిన్

Update: 2016-12-04 05:30 GMT
బాహుబలి చిత్రరాజంలో ఒక్క పాత్రయినా.. కనీసం ఒక్కసారి కనిపించే అవకాశం అయినా ఇమ్మని అడుగుతున్న స్టార్లు  చాలామందే ఉన్నారు. కానీ బాహుబలిలో కనిపించే అవకాశం వస్తే.. 30 ఏళ్లుగా సినిమాలు చేయని ఓ సీనియర్ నటి వద్దని అనే ఛాన్స్ ఉంటుందా?

కానీ సీనియర్ నటి కాంచనల విషయంలో ఇదే జరిగిది. 'బాహుబలిలో ఆమెకు చాలా ముఖ్యమైన రోల్ ఆఫర్ చేశారు. కానీ కాంచన తిరస్కరించేశారు. ఇందుకు కారణం.. రోజూ జోధ్ పూర్ వెళ్లాల్సి ఉండడమే. సినిమా కోసం తన  ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టుకోలేరు కాంచన. ముఖ్యంగా వింటర్ లో అక్కడి వాతావరణ తట్టుకోవడం కష్టం' అని కాంచన సన్నిహితులు చెబుతున్నారు.

కారణాలు ఏవైనా.. బాహుబలి సిరీస్ లో కనిపించే అరుదైన అవకాశం మిస్ అయ్యారు కాంచన. ఇంతకీ ఈ చిత్రంలో కాంచనకు రాజమౌళి ఆఫర్ చేసిన పాత్ర ఏమై ఉంటుందబ్బా అనే డిస్కషన్స్ మొదలైపోయాయి. ప్రస్తుతం అర్జున్ రెడ్డి అనే ఒక మూవీకి మాత్రం కాంచన సైన్ చేసి.. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News